గూగుల్ పేలో అదిరిపోయే ఫీచర్.. వాయిస్‌తోనే మనీ ట్రాన్స్‌ఫర్!

గతంలో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలి అంటే.ఒక రోజంతా సమయం పట్టేది.

ఇంటి నుంచి బయలుదేరి బ్యాంకు కి వెళ్లి అక్కడ క్యూలో నిల్చొని డిపాజిట్ ఫామ్ నింపి బ్యాంకు అధికారులకు ఇస్తే గానీ డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవ్వక పోయేవి.

ఈ తతంగమంతా చాలా శ్రమతో కూడుకున్నదనే చెప్పాలి.ఐతే స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత కమ్యూనికేట్ కావడం ఎంత సులభం అయిందో.

యూపీఐ, డిజిటల్ లావాదేవీలు వచ్చాక కూడా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం అంతే సులభం అయింది.

అయితే ఇప్పుడా డిజిటల్ సేవలు మరింత ఈజీ కానున్నాయి.కేవలం వాయిస్‌ కమాండ్స్ తోనే మీకు నచ్చిన వ్యక్తికి మనీ ట్రాన్స్‌ఫర్ చేసేందుకు వీలుగా ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది గూగుల్ పే.

ఈ విషయమై తాజాగా గూగుల్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.హింగ్లీష్ (హిందీ+ఇంగ్లీష్) లాంగ్వేజ్ ఫీచర్‌ను గూగుల్ పేలో యాడ్ చేయబోతున్నామని గూగుల్ తెలిపింది.

ఈ ఫీచర్‌ను వినియోగించి యూజర్లు.బ్యాంకు ఖాతా, ట్రాన్స్‌ఫర్ చెయ్యదలుచుకున్న అమౌంట్ తదితర విషయాలను హిందీ లేదా ఇంగ్లీష్ లో చెబుతూ డబ్బులు బదిలీ చేయొచ్చు.

స్పీచ్ టు టెక్స్ట్ లాగానే ఉండే ఈ ఫీచర్‌తో మీరు మీకు కావాల్సిన బ్యాంకు ఖాతాలో సులభంగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.

వాయిస్ ఇన్‌పుట్ ద్వారా బ్యాంకు ఖాతా నెంబర్ చెప్పిన తర్వాత సెకండ్ కన్ఫర్మేషన్ ఇవ్వాలి.

అంతే, సెకండ్లలోనే డబ్బు మీ ఖాతా నుంచి ఇతర ఖాతాలోకి వెళ్లిపోతుంది.మాటలతో డబ్బులు పంపించే ఫీచర్‌ను గూగుల్ పే తీసుకురావడం నిజంగా ఆశ్చర్యకరం.

ఇప్పటి వరకు ఇలాంటి ఫెసిలిటీని ఏ పేమెంట్ అప్లికేషన్ తీసుకురాలేదు. """/"/ గూగుల్ పేలో మై షాప్ అనే ఫీచర్ కూడా యాడ్ చేయాలని గూగుల్ భావిస్తోంది.

మై షాప్ అనేది చిన్న వ్యాపారుల లావాదేవీలను సులభతరం చేస్తుంది.వారు తమ వ్యాపారానికి సంబంధించి రకరకాల ఉత్పత్తుల ధరలు, వివరాలు పొందు పరిచి డిజిటల్ గా బిజినెస్ ప్రొఫైల్ సెటప్ చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది.

Hebah Patel Latest Images-ఎద అందాలతో కుర్రకారును పారేశాను చేస్తున్న..హెబ్బా పటేల్