మార్కెట్‌లో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. దీని ధర, ఫీచర్లు ఇవే..
TeluguStop.com
ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ హాప్ ఎలక్ట్రిక్ (HOP) ఇప్పటికే రెండు స్కూటర్లను లాంచ్ చేసి భారతీయ వినియోగదారులను ఆకట్టుకుంది.
ఇప్పుడు ఈ కంపెనీ లియో (LEO) పేరుతో కొత్త హై-స్పీడ్ ఈ-స్కూటర్‌ను విడుదల చేసింది.
రూ.97,000 ఎక్స్-షోరూమ్ ధరతో ఇది అందుబాటులోకి వచ్చింది.
దీనిలో 2.1 KWh లిథియం-అయాన్ బ్యాటరీ అందించగా దాని సహాయంతో సింగిల్ ఛార్జ్ పై 120 కి.
మీ ప్రయాణించవచ్చు.ఈ బ్యాటరీ 2.
5 గంటల్లో 0-80% శాతం ఛార్జ్ అవుతుంది.ఇంత వేగవంతమైన ఛార్జింగ్ అందించేందుకు దీనితోపాటు 850W ఛార్జర్‌ను ఆఫర్ చేస్తున్నారు.
"""/"/
ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 2200W BLDC హబ్ మోటార్‌తో రియర్ టైర్‌కు 90 Nm వరకు టార్క్‌ను అందించడం విశేషం.
ఇది ఎకో, పవర్, స్పోర్ట్, రివర్స్ అనే నాలుగు రైడ్ మోడ్స్ ఆఫర్ చేస్తుంది.
ఇందులోని రివర్స్ మూడు ద్వారా వెనక్కి ఈజీగా వెళ్లవచ్చు.ఈ కొత్త స్కూటర్ 160 కిలోల లోడింగ్ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది.
దీనిలో ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, బ్యాక్‌సైడ్ ట్విన్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్‌లు ఇచ్చారు.
దీనిలో రెండు 10-అంగుళాల టైర్స్ ఉండగా అవి రెండూ డిస్క్ బ్రేక్‌లతో వస్తాయి.
కాంబి-బ్రేక్ సిస్టమ్ ఇందులో ఇవ్వడం వల్ల సేఫ్టీ చాలా ఎక్కువగా ఉంటుంది. """/"/
LEO ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఎల్‌సీడీ డిజిటల్ డిస్‌ప్లే, జీపీఎస్ ట్రాకర్, IP67/65 వాటర్‌ప్రూఫ్ డస్ట్‌ప్రూఫ్ బ్యాటరీ ఉంటాయి.
హాప్ లియో ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 52 కిలోమీటర్ల దూరంతో దూసుకెళ్తుంది.ఈ కొత్త లియో స్కూటర్ జనవరి 2023 నుంచి షోరూమ్‌లలో అందుబాటులో ఉంటుంది.
ఆసక్తి గల కస్టమర్‌లు కొత్త లియో హై-స్పీడ్ (హెచ్‌ఎస్)ని కొనుగోలు చేయడానికి సమీపంలోని హాప్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సందర్శించవచ్చు.
స్కూటర్‌ను హాప్ ఎలక్ట్రిక్ వెబ్‌సైట్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు.
పవన్ కళ్యాణ్ సినిమాల్లో మ్యాటర్ తగ్గుతుందా..? ఇప్పుడు వచ్చే సినిమాల పరిస్థితి ఏంటి..?