టీఆర్ఎస్‌కు మ‌రో ఓట‌మి త‌ప్ప‌దా… అక్క‌డ కూడా కారుకు పంక్చ‌రే…!

టీఆర్ఎస్‌కు మ‌రో ఓట‌మి త‌ప్ప‌దా… అక్క‌డ కూడా కారుకు పంక్చ‌రే…!

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ ప‌ట్ల రోజు రోజుకు ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది.

టీఆర్ఎస్‌కు మ‌రో ఓట‌మి త‌ప్ప‌దా… అక్క‌డ కూడా కారుకు పంక్చ‌రే…!

దుబ్బాక ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి త‌గిలిన దెబ్బ మామూలుగా లేదు.టీఆర్ఎస్ కంచుకోట‌లో బీజేపీ పాగా వేసింది.

టీఆర్ఎస్‌కు మ‌రో ఓట‌మి త‌ప్ప‌దా… అక్క‌డ కూడా కారుకు పంక్చ‌రే…!

కేవ‌లం రెండేళ్ల క్రితం టీఆర్ఎస్ 62 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన టీఆర్ఎస్ రెండేళ్ల‌కే జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో వెయ్యి ఓట్ల‌తో బీజేపీకి సీటు కోల్పోయింది.

ఆ త‌ర్వాత గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లోనూ సొంతంగా అధికారంలోకి వ‌చ్చే ప‌రిస్థితి లేకుండా పోయింది.

బీజేపీ ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ఏకంగా 48 సీట్లు గెలుచుకుంది.ఇక ఇప్పుడు త్వ‌ర‌లో జ‌రిగే మ‌రికొన్ని ఎన్నిక‌ల్లోనూ కారుకు షాక్ త‌ప్ప‌ద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌, గ్రేట‌ర్ ఖ‌మ్మం ఎన్నిక‌ల్లో కారు పార్టీ గెలుపు అంత వీజీ కాద‌నే రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

ఇక ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ త‌ర‌పున పోటీ చేసేందుకు ఆ పార్టీ కీల‌క నేత‌లు కూడా వెనుకాడుతోన్న ప‌రిస్థితి.

వ‌రంగ‌ల్ స్థానం నుంచి మళ్లీ పల్లా రాజేశ్వర్‌రెడ్డినే రంగంలోకి దిగుతున్నారు.ఇక హైద‌రాబాద్ స్థానం నుంచి మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ పేరు వినిపిస్తున్నా ఆయ‌న పోటీ చేయ‌డం క‌ష్ట‌మే అట‌.

"""/"/ ఇక ఈ స్థానం నుంచి గ‌తంలో ఓడిపోయిన దేవీప్ర‌సాద్ తాను మ‌ళ్లీ పోటీ చేయ‌న‌ని చెపుతున్నారు.

ఇక మరో ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు కూడా పోటీకి దూరంగానే ఉంటున్నారు.దీంతో బొంతు రామ్మోహన్ ఎంపిక అనివార్యం కానుంది.

2015లో జ‌రిగిన గ్రాడ్యుయేట్స్ ఎన్నిక‌ల్లో గ్రాడ్యుయేట్స్‌లో కారు పార్టీపై తీవ్ర వ్య‌తిరేక‌త ఉండ‌డంతోనే ఉద్యోగ సంఘాల నేత దేవీ‌ప్రసాద్‍ ఓడిపోయారు.

ఇక కీల‌క‌మైన క‌రీంన‌గ‌ర్ గ్రాడ్యుయేట్స్ ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ఎస్‌కు చెందిన చంద్ర‌శేఖ‌ర గౌడ్‌పై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జీవ‌న్ రెడ్డి గెలిచారు.

"""/"/ ఇక నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్‍ అభ్యర్థి పూల రవీందర్ ఓటమి చెందగా నర్సిరెడ్డి గెలిచారు.

దీంతో టీఆర్ఎస్ వాళ్ల‌కు గ్రాడ్యుయేట్స్ ఎన్నిక‌లు అంటేనే పోటీ చేయ‌డానికి భ‌యం ప‌ట్టుకుంది.

ఏదేమైనా ఇప్ప‌టికే వ‌రుస ఎదురు దెబ్బ‌ల‌కు ఈ ఎన్నిక‌ల్లో కూడా పార్టీ ఓడిపోతే మ‌రింత మైన‌స్‌లో ప‌డ‌తామ‌న్న భ‌యంతో వెన‌కంజ వేస్తున్నారు.

ఇక నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల భ‌యం కూడా టీఆర్ఎస్‌ను వెంటాడుతోంది.

పహల్గామ్‌లో ఉగ్రదాడి.. ముగ్గురు తెలుగువారితో పాటు 30 మంది బలి!