వాట్సాప్ లో మరో అదిరిపోయే ఫీచర్.. ఇకపై కాల్ కట్ అయితే ఇలా చేయండి..

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో భాగమైపోయింది.ఇలాంటి అప్లికేషన్ ను అద్భుతంగా తీర్చిదిద్దడానికి వాట్సాప్ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకురావడానికి కృషి చేస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా మరో ఫీచర్ ను తీసుకొచ్చింది.ఇప్పటివరకు ఎవరైనా యూజర్ గ్రూప్ వీడియో కాల్ నుంచి బయటికి వచ్చినా లేదా కాల్ కట్ అయినా మళ్లీ జాయిన్ కావడానికి ఎలాంటి సదుపాయాలు లేవు.

దీంతో యూజర్లు తెగ ఇబ్బంది పడిపోతున్నారు.ఈ సమస్యకు తాజాగా చెక్ పెడుతూ వాట్సాప్ "జాయిన్" అనే ఓ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది.

ఈ ఫీచర్ వినియోగించి కట్ అయిన గ్రూప్ కాల్‌లో మళ్లీ యాడ్ కావచ్చు.

ఉదాహరణకి మీరు ఒక గ్రూప్ వీడియో కాల్‌లో ఉన్నారనుకోండి.ఆ సమయంలో కాల్ కట్ చేస్తే.

మీ వాట్సాప్ లో వీడియో కాల్ కి సంబంధించి ఒక ఆన్-గోయింగ్ స్టేటస్ కనిపిస్తుంటుంది.

ఆ స్టేటస్ పై క్లిక్ చేసి వాట్సాప్ లో జాయిన్ కావచ్చు.గతంలో వాట్సాప్ గ్రూప్ కాల్ అనేది యూజర్ల పేర్లతో కాల్స్ సెక్షన్ లో కనిపిస్తూ ఉండేది.

కానీ ఇప్పుడది ఒక చాట్ రూపంలో మనకి కనిపిస్తుంది.ఆ చాట్ లోకి వెళ్లి మెసేజ్ లు పంపించవచ్చు.

అలాగే అదే చాట్ లో పైన కనిపిస్తున్న జాయిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి వీడియో కాల్ లో తిరిగి యాడ్ కావచ్చు.

ఈ ఫీచర్ వాయిస్ కాల్స్ కి కూడా అందుబాటులో ఉంది.దీనికి తోడు ఒక్కో వాట్సాప్ కాల్స్ కు ఇప్పుడు ఒక్కో రింగ్‌టోన్‌ను సెట్ చేసుకోవచ్చు.

ఇది వినియోగదారులకు వాట్సాప్ గ్రూప్ కాల్‌ను గుర్తించడంలో సహాయపడుతుంది.ప్రస్తుత యూజర్ల అవసరాలకు అనుగుణంగా గ్రూప్ కాల్స్ కు సంబంధించి వాట్సాప్ చాలా అప్డేట్స్ తీసుకొస్తోంది.

కొద్ది రోజుల క్రితం కాల్ కొనసాగుతున్న సమయంలో గ్రూప్ లోని వేరే వ్యక్తికి కనెక్ట్ చేసేలా ఓ ఆప్షన్ కూడా పరిచయం చేసింది.

విజయవాడ లో పసుపుజాతర