కాణిపాక వినాయకుడి ఆలయంలో మరో వివాదం..

కాణిపాక వినాయకుడి ఆలయంలో మరో వివాదం

మన దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్నో పురాతనమైన ఆలయాలలోకి ప్రతిరోజు భక్తులు వెళ్లి పూజలు చేసి దేవుళ్లకు కానుకలును వారి స్థాయికి తగ్గట్టుగా హుండీలో వేసి వస్తూ ఉంటారు.

కాణిపాక వినాయకుడి ఆలయంలో మరో వివాదం

విజ్ఞాన అధిపతి కొలువైన గణపతి దేవుని చుట్టూ కొన్ని రోజులుగా రకరకాల వివాదాలు జరుగుతున్నాయి.

కాణిపాక వినాయకుడి ఆలయంలో మరో వివాదం

భక్తులు ఇచ్చే కానుకులకు రసీదులు ఇవ్వకపోవడం వల్ల దేవాలయ సిబ్బందిని భక్తులు ప్రశ్నించారు.

అయితే ఈ మధ్యకాలంలో పాలకమండలి అర్చకులపై సస్పెన్షన్ వేటు వేసి విచారణను మొదలుపెట్టింది.

చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వినాయక దేవాలయం ప్రతిరోజు ఏదో ఒక వివాదాల వల్ల వార్తల్లో నిలుస్తూనే ఉంది.

భక్తులు ఇచ్చిన కానుకలకు, డబ్బులకు రసీదులు ఇవ్వలేదన్న రచ్చ కొత్త వివాదానికి తీరలేపింది.

మహా కుంభాభిషేకం నడుస్తున్న ఈ సమయంలో వేలూరు గోల్డెన్ దేవాలయం వ్యవస్థాపకులు నారాయణి అమ్మని స్వామి కానుకలు సమర్పించారు.

స్వామివారికి ఇచ్చిన బంగారు విభూతి పట్టీకి రసీదు ఇవ్వలేదు.ఈ విషయాన్ని భక్తులు బయట పెట్టడంతో అక్కడ గొడవ మొదలైంది.

"""/"/ ఈ ఆలయ ఉప ప్రధాన అర్చకులు ధర్మేష్ గురుకుల్ ను సస్పెండ్ చేసింది.

దీనిపై విచారణ జరుగుతుండగానే మరో ధాత ఇచ్చిన కానుకపై వివాదం జరగడం ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఈ దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మనీకంటేశ్వర దేవాలయానికి విజయలక్ష్మి అనే భక్తురాలు కానుకలు సమర్పించింది.

ఈ భక్తురాలికి రసీదు ఇవ్వకపోవడంతో గొడవ మొదలైంది.ఈ వివాదం పెద్ద చర్చకే దారితీసింది.

ఇప్పటికే టెంపుల్ దేవాలయ ఉప ప్రధాన అర్చకులు ధర్మేష్ గురుకులను సస్పెండ్ చేసింది.

మరో ఉప ప్రధాన అర్చకులు సోమశేఖర స్వామి పై విచారణ జరుగుతూ ఉంది.

ఆలయంలో జరుగుతున్న ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిగితేనే నిజ నిజాలు బయటకి వస్తాయని భక్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ కాణిపాకం ఆలయంలో వరుస వివాదాలు జరుగుతుండడం వల్ల భక్తుల మనోభావాలు తినే అవకాశం ఉందని మరి కొంతమంది చెబుతున్నారు.

యూకేలో ప్రఖ్యాత వైద్య సంస్థకు ప్రెసిడెంట్‌గా భారత సంతతి వైద్యురాలు