పవన్ కళ్యాణ్ పై ఎన్నికల సంఘానికి మరో ఫిర్యాదు..!!

ఏపీలో ఎన్నికలు( Elections In AP ) దగ్గర పడుతున్నాయి.కేవలం 20 రోజులు మాత్రమే సమయం ఉంది.

ఈ క్రమంలో ప్రచార కార్యక్రమాలలో పార్టీలు అధినేతలు చేస్తున్న తప్పులను ఎలక్షన్ కమిషన్ ఓ కంట కనిపెడుతుంది.

ఇదే సమయంలో అన్ని పార్టీల అభ్యర్థులపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉంటే ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

నేడు ఏప్రిల్ 23వ తారీకు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.పవన్ కళ్యాణ్ నామినేషన్ కార్యక్రమానికి యువత భారీ ర్యాలీగా వచ్చారు.

కాగా తాజాగా పవన్ కళ్యాణ్ పై ఎన్నికల సంఘానికి మరో ఫిర్యాదు అందింది.

"""/" / విషయంలోకి వెళ్తే పిఠాపురంలో( Pithapuram ) జరిగిన నామినేషన్ ర్యాలీలో పవన్ కళ్యాణ్ జాతీయ పతాకాన్ని వినియోగించారంటూ జర్నలిస్టు నాగార్జున రెడ్డి( Nagarjuna Reddy ) ఈసీకి ఫిర్యాదు చేశారు.

ఎన్నికల కార్యక్రమంలో జాతీయ పథకాన్ని వినియోగించడంపై నాగార్జున రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

మరోవైపు పిఠాపురంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద 100 మీటర్ల నిబంధనను కూటమి సభ్యులు .

ఉల్లంఘించారని వైసీపీ శ్రేణులు విమర్శలు చేస్తున్నాయి.ఎన్నికల ప్రచారంలో కొద్దిరోజుల క్రితం పవన్ కళ్యాణ్ పై ఈసీకి పలు ఫిర్యాదులు చేయడం జరిగింది.

ఎలక్షన్ సమీపిస్తున్న కొలది.అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

ఈ క్రమంలో ఒకరిపై మరొకరు భారీ ఎత్తున విమర్శలు చేసుకుంటున్నారు.ఇలాంటి సమయంలో నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తున్న నేతలపై ఈసీ చర్యలు తీసుకుంటూ ఉంది.

కెనడాలో మ్యాగీ నూడుల్స్‌తో షాకింగ్ ప్రయోగం.. -17°C చలికి ఏం జరిగిందో చూడండి..