తిరుమల నడకదారిలో మరో చిరుత సంచారం

తిరుమల నడకదారిలో మరో చిరుత సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.ఇటీవల చిరుత దాడిలో చనిపోయిన చిన్నారి లక్షిత మృతదేహం లభ్యమైన చోట చిరుతపులి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

దీంతో అప్రమత్తమైన అధికారులు ఐదో చిరుతను కూడా బంధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే తిరుమలకు వెళ్లే నడక మార్గంలో లక్షిత మృతితో అప్రమత్తమైన టీటీడీ మరియు అటవీశాఖ అధికారులు భక్తుల భద్రత దృష్ట్యా పలు చర్యలు తీసుకున్నారు.

ఈ క్రమంలోనే బోన్లను ఏర్పాటు చేసి చిరుతలను పట్టుకున్న సంగతి తెలిసిందే.

మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ మూవీ ఆగిపోయిందా.. బాలయ్య కొడుకుకే ఎందుకిలా?