హెచ్‎సీఏపై మరో కేసు నమోదు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‎పై మరో కేసు నమోదు అయింది.భారత్ -ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్లు విక్రయం, తొక్కిసలాటపై ఇప్పటికే మూడు కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

తాజాగా హెచ్‎సీఏపై మరో కేసును బేగంపేట పోలీసులు నమోదు చేశారు.మ్యాచ్ టికెట్ పై ఉన్న సమయం, మ్యాచ్ ప్రారంభానికి వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో.

హెచ్‎సీఏ తప్పుడు టైమింగ్ ఇచ్చిందని ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దీంతో హెచ్‎సీఏపై ఇప్పటివరకు మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి.