ఇండియాలో మరో సరికొత్త ఈ-స్కూటర్ లాంచ్.. దీని ధర, రేంజ్, ఫీచర్స్ ఇవే!

ఈ రోజుల్లో చాలామంది పెట్రోల్ ఖర్చులు తగ్గించుకునేందుకు ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేస్తున్నారు.

ఈ వాహనాలను డ్రైవ్ చేయడం చాలా సులభం.అంతేకాదు చాలా తక్కువ ఖర్చుతో రోజూ ఆఫీస్‌కి లేదా పనులకు వెళ్లి రావచ్చు.

అందుకే చాలామంది మార్కెట్లోకి వస్తున్న సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు.

అయితే డిమాండ్ విపరీతంగా ఉండటంతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త వాహనాలను లాంచ్ చేస్తున్నాయి.

ఇందులో భాగంగానే తాజాగా 'కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్' సంస్థ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేసింది.

'జింగ్ హెచ్ఎస్ఎస్ (Zing HSS)' పేరుతో విడుదలైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 60 కిలోమీటర్లు.

దీని ధర రూ.85,000 (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 125 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.కంపెనీ చెప్పినట్లు అంత రేంజ్ రాకపోయినా ఈజీగా వంద కిలోమీటర్లు ప్రయాణించవచ్చని నిపుణులు అంటున్నారు.

ఈ రేంజ్‌తో ఒక సిటీ నుంచి మరొక సిటీ కూడా వెళ్లి రావచ్చు.

ఈ స్కూటర్ రెడ్, బ్లూ, వైట్ కలర్స్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది.ఇందులో నార్మల్, ఎకో, పవర్ అనే 3 రైడింగ్ మోడ్స్ ఆఫర్ చేశారు.

యువతీ, యువకుల అవసరాలకు తగినట్లుగా ఇందులో మల్టీ-స్పీడ్ మోడ్, అడ్జస్టబుల్ సస్పెన్షన్, పార్ట్ ఫెయిల్యూర్ ఇండికేటర్, రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి అద్భుతమైన ఫీచర్లు అందించారు.

దీని డిజైన్ కూడా చాలా బాగుంది.60V, 28Ah లిథియం-అయాన్ బ్యాటరీతో ఇది అందుబాటులోకి వచ్చింది.

దీనిని 0-100% ఛార్జ్ చేయడానికి 3 గంటలు చాలుని కంపెనీ చెబుతోంది.ఈ బ్యాటరీ మూడేళ్ల వారంటీతో వస్తుంది.

నా శరీరంలో నడుమునే ఎందుకు చూపిస్తున్నారు.. ఇలియానా షాకింగ్ కామెంట్స్ వైరల్!