ఆదిత్య -ఎల్1 మిషన్ పై ఇస్రో మరో ప్రకటన

ఆదిత్య -ఎల్1 మిషన్ భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం మరో ప్రకటన చేసింది.

ఆదిత్య -ఎల్ 1 మిషన్ శాస్త్రీయ డేటాను సేకరించడం ప్రారంభించిందని తెలిపింది.స్టెప్స్ పరికరం సెన్సార్ లు భూమి నుంచి 50 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న సుప్రా- థర్మల్, ఎలక్ట్రాన్లు, ఎనర్జిటిక్ అయాన్ లను కొలవడం ప్రారంభించాయని ప్రకటించింది.

కాగా భూమి నుంచి 50 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లేంత వరకు ఈ మిషన్ డేటాను సేకరిస్తుందని తెలిపింది.

అదేవిధంగా ఆదిత్య -ఎల్1 మిషన్ సేకరించిన డేటా భూమి చుట్టూ ఉన్న కణాల ప్రవర్తనను విశ్లేషించడానికి సహాయపడుతుందని వెల్లడించింది.

ఒక్క మల్టీప్లెక్స్ లో రూ.5 కోట్ల కలెక్షన్లు సాధించిన కల్కి.. ఈ రికార్డ్ మామూలు రికార్డ్ కాదుగా!