తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో మరోసారి ప్రమాదం
TeluguStop.com
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో మరోసారి ప్రమాదం జరిగింది.ఘాట్ రోడ్డులోని ఆరవ మలుపు టెంపో ట్రావెలర్ బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో పలువురు భక్తులు గాయపడ్డారు.గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
దీంతో బాధితులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.బాధిత భక్తులు కర్ణాటకలోని కోలార్ చెందిన వారిగా అధికారులు గుర్తించారు.
టెంపో ట్రావెలర్ డ్రైవర్ అజాగ్రత్తగా వ్యవహారించడం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.
అయితే ఇటీవలే మొదటి ఘాట్ రోడ్డులో చోటు చేసుకున్న బస్సు బోల్తా ప్రమాదంలో భక్తులు గాయపడిన సంగతి తెలిసిందే.
వైరల్: కోయ్ కోయ్ ‘పాస్టర్’ పాటలో అంత డెప్త్ వుందా?