లెబనాన్ లో మరో ప్రమాదం.. రంగంలో ఆర్మీ !

గత నెలలో లెబనాన్ లో భారీ పేలుడు సంభవించింది.ఈ పేలుడులో సుమారు 190 మంది ప్రాణాలు కోల్పోయారు.

వేల సంఖ్యలో ప్రజలు క్షతగాత్రులయ్యారు.మూడు వేల టన్నుల అమ్మోనియం నైట్రేట్ పేలడంతో దీని ప్రభావం కిలోమీటర్ల వరకు పాకింది.

ప్రాణ నష్టంతో పాటు ఆర్థికంగా కోలుకోలేని పరిస్థితి.ఈ ఘటనను మరవకముందే గురువారం మధ్యాహ్నం ఓడరేవులో భారీ అగ్ని ప్రమాదంతో మంటలు చెలరేగాయి.

లెబనాన్ బీరుట్ నౌకాశ్రయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.ఓడరేవు వద్ద డ్యూటీ ఫ్రీ జోన్ లో చమురు, టైర్లను ఉంచే గిడ్డంగిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

దీంతో లెబనాన్ ఆర్మీ సైనం ఘటనా స్థలానికి చేరుకుంది.ప్రత్యేక హెలికాప్టర్ల సాయంతో చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన ఆర్మీ ఓడరేవు దగ్గరున్న కార్యాలయ ఉద్యోగులను అక్కడి నుంచి తరలించారు.

ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించకుండా ఆర్మీ ఆధీనంలోకి తీసుకున్నారు.గోడౌన్ లో అగ్ని ప్రమాదాన్ని అదుపులో తీసుకురావడానికి ఫైర్ ఇంజిన్లు త్వరగా చేరుకునేలా రోడ్డును క్లియర్ చేశారు.

పరిస్థితి అదుపులో ఉందని అక్కడి పోలీస్ ప్రతినిధి కల్నల్ జోసెఫ్ మసలాం అన్నారు.

కాగా, మరోసారి లెబనాన్ లో మరో అగ్నిప్రమాదం సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

రెబల్ అభ్యర్థులపై టీడీపీ సస్పెన్షన్ వేటు..!