దేశ వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావం హడావుడి.. ఎన్ని కోట్లు ఖర్చు?

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం( Telangana State Formation Day ) సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ( BRS Party ) హడావుడి అంతా ఇంతా కాదు.

దేశ వ్యాప్తంగా వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో( Parliament Elections ) పోటీ చేసే ఉద్దేశ్యంతో ఆవిర్భావ దినోత్సవంకు సంబంధించిన ప్రకటనలను ఇవ్వడం జరిగింది.

కోట్ల రూపాయలు ఖర్చు చేసి దేశ వ్యాప్తంగా కూడా ప్రకటనలు ఇవ్వడం జరిగింది.

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో జరిగిన అభివృద్దిని ఏకరువు పెడుతూ చాలా రాష్ట్రాల్లో పేపర్ ఫుల్‌ పేజ్ యాడ్స్ ని ఇవ్వడం జరిగింది.

ప్రభుత్వంకు ప్రచారం పేరుతో బీఆర్‌ఎస్ పార్టీ యొక్క ప్రచారం చేస్తున్నారు అంటూ విపక్ష పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

"""/" / ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రభుత్వ ధనం ను ఖర్చు చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు.

అలాంటిది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఇచ్చిన ప్రకటనల ఖర్చు పదుల కోట్లు దాటి వందల కోట్లు అవుతుందని విపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వని రేంజ్ లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడం ద్వారా కచ్చితంగా మైలేజ్ బాగానే వచ్చి ఉంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

"""/" / దేశ వ్యాప్తంగా ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ యొక్క నాయకులు మరియు కార్యకర్తలు కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హడావుడి చేయడం జరిగింది.

ఒక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంను ఈ స్థాయిలో చేయడం ఏంటో అర్థం కావడం లేదు అంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఖర్చు విషయంలో బీఆర్‌ఎస్ పార్టీకి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఖర్చు మొత్తంను కూడా బీఆర్‌ఎస్ పార్టీ భరించాల్సిందే అంటూ మరి కొందరు డిమాండ్ చేస్తున్నారు.