2022 ఏడాదికి సంబంధించి 22వ నంది నాటకోత్సవంలో ప్రాథమిక స్థాయిలో ఎంపికైన నాటకాలు ప్రకటన..

విజయవాడ: 2022 ఏడాదికి సంబంధించి 22వ నంది నాటకోత్సవం లో ప్రాథమిక స్థాయిలో ఎంపికైన నాటకాలు ప్రకటన.

వివరాలు ప్రకటించిన ఎపీ రాష్ట్ర చలన చిత్ర టి.వి.

నాటకరంగ అభివృద్ది సంస్థ.వివరాలు ప్రకటించిన సంస్థ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి, ఎండీ విజయకుమార్, జ్యూరీ సభ్యులు విజయకుమార్, ఐ అండ్ పీఆర్ కమిషనర్.

అవార్డులకు 5 విభాగాల్లో 115 ఎంట్రీలు రాగా ఫైనల్స్ కు 38 నాటకాలు ఎంపికయ్యాయి.

ఫైనల్ లో ఎంపికైన వారికి మొత్తం 73 అవార్డులు ఇస్తాం.ఉత్తమ ప్రదర్శనలో ప్రథమ, ద్వితీయ, తృతీయ అవార్డులు ఇస్తాం.

కళాకారులు, సాంకేతిక విభాగ సిబ్బందికి వ్యక్తిగత అవార్డులు ఇస్తాం.ఎంపికైన పద్య నాటకానికి రూ.

50,000, సోషల్ ప్లే - రూ.40,000, బహుమతి ఇస్తాం.

సోషల్ ప్లే లెట్, చిన్నపిల్లల ప్లే లెట్, కళాశాల,విశ్వ విద్యాలయం విద్యాలయాల విభాగంలో ఎంపికైన నాటకానికి, రూ.

25,000 చొప్పున బహుమతి.నవంబర్ మొదటి వారంలో నంది నాటకోత్సవం 2022 ప్రదానం చేసే అవకాశం.

ఫైనల్ పోటీలు ఎప్పుడు, ఎక్కడ జరుపుతామనే విషయాన్ని తర్వాత తెలియజేస్తాం.ఛైర్మన్ పోసాని కృష్ణమురళి, గతంలో అవార్డుల ఎంపికలో అవకతవకలు జరిగాయి.

గతంలో నాకిచ్చిన అవార్డులనూ నేను రిజెక్ట్ చేశా.విషయం తెలుసుకుని గతంలో నంది అవార్డులను చంద్రబాబు రద్దు చేశారు.

ఎక్కడా అవకతవకలకు తావు లేకుండా నంది అవార్డులు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు.

సీఎం ఆదేశాల మేరకు నిస్పక్షపాతంగా వ్యవహరించా.నంది నాటకాల ఎంపిక కోసం కులాలు, మతాలు అని తేడా లేకుండా అందరు జడ్జిలను నియమించాం.

జ్యూరీ సభ్యులకు నేను ఎప్పుడూ ఎక్కడా ఏమీ చెప్పలేదు.పలానా నాటకాన్ని సెలక్ట్ చేయాలని ఎవరికీ ఎప్పుడూ నేను చెప్పలేదు.

జ్యూరీ సభ్యులు చాలా పారదర్శకంగా, నిస్పాక్షికంగా వ్యవహరించి నాటకాలను ఎంపిక చేశారు.