అన్నవరం అంటే వ్రతాలే కాదండోయ్.. ప్రసాదం కూడా!

అన్నవరం పేరు వింటే చాలు.చాలా మందికి సత్యనారాయణ స్వామి వ్రతాలు, విస్తరాకుల్లో అక్కడ దొరికే ప్రసాదమే గుర్తుకొస్తుంది.

కొత్త జంటలతో ఎప్పుడూ ఆ ఆలయం కళకళలాడుతూ ఉంటుంది.స్వామి వారిని దర్శించుకుని పెళ్లైన జంటలు అక్కడ సత్యనారాయణ వ్రతాలు చేస్తే.

ఆయురారోగ్యాలతో పాటు సకల శుభాలు కల్గుతాయని భక్తుల నమ్మకం.అందుకే కొత్తగా పెళ్లన దంపతులు అక్కడికి వెళ్లి సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తుంటారు.

వ్రతాలే కాకుండా అక్కడ దొరికే స్వామి వారి ప్రసాదం కూడా చాలా ఫేమస్.

గోధుమ నూక, పంచదార, యాలకుల పొడి, నెయ్యితో చేసే ఆ ప్రసాదాన్ని ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు.

తిరుపతి లడ్డూ ఎంత ఫేమసో.అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదానికి కూడా అంతే గుర్తింపు ఉంది.

అంతేకాదండోయ్ ఇక్కడు వ్రతాలు ఆచరించే వారి కోసం మరో ప్రసాదాన్ని కూడా తయారు చేస్తారు.

అదే బంగీ ప్రసాదం. """/"/ కానీ ఈ ప్రసాదం కంటే కూడా ఎక్కువ మంది గోధుమ నూకతో చేసిన ప్రసాదాన్ని తీసుకోవడానికే ఇష్టపడుతుంటారని అక్కడి ఆలయ అధికారులు చెబుతుంటారు.

రత్నగిరి కొండపై ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో తప్ప.ఈ ప్రసాదాన్ని ఎక్కడ తయారు చేసిన ఇంత రుచి రాదని అంటున్నారు.

స్వామి వారి దయ వల్లే ఈ ప్రసాదం అంత రుచిగా ఉంటుందని భక్తుల నమ్మకం.

పిలివగానే పలికి.కష్టాలు కడతీర్చే అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారు.

బంతి పంట నాటుకునే విధానం..ఆకుమచ్చ తెగుళ్ల వ్యాప్తికి నివారణ చర్యలు..!