తనపై 8 సార్లు కొరడా ఝులిపించుకున్న అన్నామలై..
TeluguStop.com
చెన్నైలోని గిండి అన్నా యూనివర్శిటీలో విద్యార్థినిపై జరిగిన లైంగిక వేధింపుల (Sexual Harassment Of A Student At Anna University)ఘటనకు సంబంధించి చాలామంది తీవ్రంగా ఖండించారు.
తాజగా తమిళనాడు బీజేపీ(BJP) అధ్యక్షుడు అన్నామలై(Annamalai) ఈ ఘటనపై నిరసనగా, డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన ఇంటి ముందు ఆందోళన చేపట్టారు.
డిసెంబర్ 26న గిండి అన్నా యూనివర్శిటీలో జరిగిన లైంగిక వేధింపుల ఘటనను నిరసిస్తూ, చెన్నైలో బీజేపీ నేతృత్వంలో పెద్దఎత్తున ప్రదర్శన కూడా నిర్వహించారు.
ఈ నిరసనలో మాజీ గవర్నర్ తమిళిసై, బీజేపీ ఉపాధ్యక్షుడు కారు నాగరాజన్ (Tamilisai, BJP Vice President Karu Nagarajan)సహా 417 మంది పాల్గొన్నారు.
అయితే, ఇందులో భాగంగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. """/" /
ఇది ఇలా ఉంటే.
మరొక వైపు కోయంబత్తూరులోని కాలాపట్టిలో ఉన్న తన ఇంటి ముందు అన్నామలై (Annamalai)ఎనిమిది సార్లు కొరడాలతో కొట్టున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
అతను తొమ్మిదోసారి కొరడాతో కొట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు, సమీపంలోని బీజేపీ కార్యకర్త కొరడా దెబ్బలు ఆపడానికి అన్నామలైని కౌగిలించుకున్నాడు.
అలాగే కోయంబత్తూరులో(Coimbatore) విలేకరుల సమావేశంలో అన్నామలై మాట్లాడుతూ, విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి డీఎంకే ప్రభుత్వ వైఫల్యాన్ని చాటుస్తుందని అన్నారు.
డీఎంకేను అధికారం నుంచి దించే వరకు తాను చెప్పులు వేసుకోనని, ఈ విషయంలో ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని చెప్పారు.
ఈ సంఘటన డీఎంకే ప్రభుత్వంపై విమర్శలను మరింత పెంచడంతో పాటు, విద్యార్థుల భద్రతపై కొత్త చర్చలకు దారితీసింది.
విద్యార్థులకు సురక్షితమైన వాతావరణం కల్పించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అన్ని వర్గాల ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు.
వైరల్ వీడియో చూసిన నెటిజన్స్ తప్పు చేసిన వారికి కట్టిన శిక్ష తప్పని సరి అమలు చేయాలి అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటే.
మరికొందరు విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి గురించి మాట్లాడుకుంటున్నారు.
కొత్త కార్యాలయంలోకి అడుగు పెట్టిన కాంగ్రెస్ పార్టీ