అంజనా దేవి వల్ల మారిపోయిన శ్రీజ

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తెలియని వారు ఉండరు.

ఆయన చేసిన సినిమాలు అలాంటివి.చిరంజీవి ఒక సూపర్ స్టార్ కానీ ఆయనకీ కూడా కష్టాలు ఉన్నాయి , మీరు అనుకోవచ్చు ఆయనకీ కష్టాలేంటి, కోట్లకి అధిపతి, కష్టాన్ని కాంపౌండ్ గేట్ కూడా దాటనివ్వడు అని అనుకోవచ్చు, కష్టం అనేది ఎవరి తాహతుకు తగ్గట్టు వాళ్లకి ఉంటాయి, అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైంది.

చిరంజీవి ఫ్యామిలీ చాలా పెద్దది, అయితే ఆయనకీ ముగ్గురు సంతానం, సుస్మిత, రామ్ చరణ్, శ్రీజ( Sushmita, Ram Charan, Sreeja ).

అయితే ఈ ముగ్గురిలో శ్రీజ అంటే అమితమైన ప్రేమ చిరంజీవికి.మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది.

గతంలో తన కుటుంబాన్ని ఎదిరించి ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత శ్రీజ ఆ వ్యక్తితో విడాకులు తీసుకుని ఆ తర్వాత మళ్లీ కొంతకాలానికి చిరంజీవి స్నేహితుడు కొడుకైన కళ్యాణ్ దేవ్‌ని( Kalyan Dev ) రెండో వివాహం చేసుకుంది.

ఈ దంపతులు కూడా ఓ బిడ్డ జన్మించింది కానీ వారి మధ్య విభేదాలు రావడంతో ప్రస్తుతం ఎవరికి వారు ఒంటరిగా ఉంటున్నారు.

"""/" / ఇప్పుడు ఇదే విషయం చిరంజీవిలో కలతకు కారణమయ్యాయిట.అయితే ఇలాంటి విషయాల్లో ఎలా ఉండాలో చిరు మాతృమూర్తి అంజనాదేవి ఇచ్చిన ఓ సలహా శ్రీజకు ఎంతో ఓర్పుని ఇచ్చిందని చిరంజీవి అన్నారు.

రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన చిరంజీవి.ఆ ఇంటర్వ్యూలో ఇటీవల నా కూతురు శ్రీజ నాతో ఓ విషయాన్ని పంచుకుందని చెప్పుకొచ్చారు.

ఇటీవల కాలంలో శ్రీజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి. """/" / అలా ఒక రోజు బాధపడుతూ వాళ్ల నాన్నమ్మ దగ్గరికి వెళ్లిందట.

అప్పుడు అమ్మ.జీవితం అంటే ఒక వ్యక్తితోనే అయిపోదు.

నిన్ను కంట్రోల్ చేసి బాధపెట్టే వాళ్లకు నువ్వు దూరంగా ఉండు.నీ మనసుకు ఏది మంచిగా అనిపిస్తే అది నువ్వు చెయ్యి.

అని శ్రీజకు మంచి సలహా ఇచ్చిందట.శ్రీజ వచ్చి 'డాడీ.

నాన్నమ్మ మాటలు వింటే చాలా పాజిటివ్ గా అనిపించింది' అని చిరుతో ఆ మాట గురించి చెప్పుకుందట.

తన తల్లి ఎంతో పాజిటివ్ గా ఉంటారని కూడా చిరు అన్నారు.ప్రస్తుత కాలంలో అమ్మలాంటివాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు అమ్మ వల్లే మా అందరికీ స్వాతంత్రంగా ఉండే వ్యక్తిత్వాలు వచ్చాయని చిరు సోదరి మాధవి కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఇండివిడ్యువాలిటీ అనేది మెగాస్టార్ చిరంజీవికి నేర్పింది అంజనా దేవి గారు.అది చాలా సందర్భాల్లో అందరికీ శ్రీరామరక్ష అంటూ చిరు తమ తల్లి అంజనాదేవి గురించి ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

ఇక ప్రస్తుతం చిరంజీవి ఇంటి భాద్యతలు చూసుకుంటూనే సినిమాల్లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు.

రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టట్లేదా.. అయితే ఇది తప్పక తెలుసుకోండి!