శివుని అంశతో పుట్టిన ఆంజనేయుడు రామ భక్తుడిగా ఎందుకు మారాడు?

విష్ణువు హృదయం శివుడు.శివుని హృదయం విష్ణువు అని మన పురాణాలు చెబుతున్నాయి.

శివుడు రామ భక్తుడు.పార్వతీ దేవికి 'శ్రీరామ రామ రామేతి, రమే రామే మనోరమే' సహస్ర నామ తత్తుల్యం, రామనావరాననే అని రామ తత్త్వాన్ని శివుడే చెప్పాడు.

కాశీలో మరణించిన ప్రాణుల కుడి చెవిలో విశ్వేశ్వరుడు రామ తారక మంత్రం చెబుతాడట.

హనుమత్సంహితలో శంకరుడే రామ సేవా కాంక్షతో హనుమంతునిగా జన్మించాడని చెప్పబడింది.పార్వతీ దేవితో శివుడు 'దేవీ! రావణుడు తన పది తలలు కోసి అగ్నిలో వేసి.

దశ రుద్రుల కరుణకు పాత్రుడు అయ్యాడు.ఏకాదశ రుద్రుని ఉపేక్షించి నాడు.

నా అంతరంగిక భక్తుడైన నందీశ్వరుని రావణుడు హేళన చేశాడు.కావున రావణుని శిక్షించడానికి ఏకాదశ రుద్రాంశతో నేనే రామ భక్తుడైన హనుమంతునిగా పుట్టి రావణుని శిక్షించెదను.

నన్ను అవమానించినా భరిస్తాను గాని, నా భక్తుని అవమానిస్తే భరించలేను.అని శంకరుడే హనుమతుండి రూపంలో జన్మించాడు.

అకార ఉకార మకరాలు కలిస్తే ఓంకారం అనే ప్రణవం ఏర్పడుతుంది.అందు 'అకారో విష్ణు' అని చెప్పబడింది.

శ్రీకృష్ణుడు 'అక్షరాణాం' 'అ' కారోస్మి అన్నారు.అంటే 'అ' విష్ణు బీజం.

'మకా రాక్షరసంభూతఃశివస్తు హనుమాన్ స్మృతః' అని తారసారోప ఉప నిషత్తు చెబుతుంది.కనుక శివ విష్ణువులు ఇద్దరు ఓంకార స్వరూపులే అని అర్థం చేసుకోవాలి.

తనను తాను ఎలాగు దైవంగా భావించలేడు కాబట్టి శ్రీరామ చంద్రుడి రూపంలో ఉన్న శ్రీ మహా విష్ణువు భక్తుడిగా ఆ హనుమంతుడి రూపంలో ఉన్న శివుడు మారాడు.

మంచు లక్ష్మి ఒంటి నిండా టాటులు…వీటి అర్థం ఏంటో తెలుసా?