పవన్ అన్నప్రాసన సమయంలోనే అలాంటి పని చేశాడా.. సీక్రెట్ రివీల్ చేసిన అంజనాదేవి?

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ప్రస్తుతం రాజకీయాల పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఈయన సినిమాలంటే ఇష్టం లేకపోయినా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా తక్కువ సమయంలోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇలా సినిమాలలో సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి అడుగుపెట్టి ఇక్కడ కూడా డిప్యూటీ సీఎం( Ap Deputy CM ) స్థాయికి ఎదిగారు.

ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉన్నత హోదాలో ఉండడంతో ఆయనకు సంబంధించి ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి.

"""/" / ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి ( Anjana Devi ) ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఎన్నో విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా అంజనాదేవి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుంచి కూడా చాలా పట్టుదల మొండితనం ఉన్న వ్యక్తి అని తెలిపారు.

ఏదైనా తనకు చేయాలి అనిపిస్తే చేసే వరకు వదిలిపెట్టారు.ఇక చిన్నప్పటినుంచి కూడా ఎంతో ఆధ్యాత్మిక భావన కలిగినటువంటి వ్యక్తి అని చెప్పాలి.

నాకోసం ఒకసారి అయ్యప్ప మాల వేసి శబరికి కూడా వెళ్లి వచ్చారని అంజనాదేవి తెలిపారు.

"""/" / ఇక పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇది కావాలి అని ఎప్పుడూ అడిగిన సందర్భాలు లేవు.

ఇంట్లో చిన్నప్పుడు కూడా అందరూ భోజనం చేశాకే చేసేవాడు తనకు పులావ్ అంటే చాలా ఇష్టమని ఈమె తెలిపారు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ అన్నప్రాసన సమయంలో జరిగిన సంఘటనను కూడా ఈ సందర్భంగా అంజనా దేవి అభిమానులతో పంచుకున్నారు.

పవన్ కళ్యాణ్ అన్నప్రాసన సమయంలో కత్తి అలాగే పెన్( Pen )పట్టుకున్నారని అది చూసిన మేము తాను ప్రజలకు ఏం చేస్తాడునని అప్పట్లో అనుకున్నాము అనుకున్న విధంగానే ప్రజాసేవకే ప్రాధాన్యత ఇచ్చారు అంటూ ఈమె పవన్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

యూఏఈలోని ఎన్ఆర్ఐలకు అలర్ట్ .. పాస్‌పోర్ట్ రెన్యూవల్ గైడ్‌లైన్స్ చూశారా?