గేమ్ ఛేంజర్ సినిమాలో అంజలి రోల్ ఇదేనా.. సినిమాకు ఆమే హైలెట్ కానున్నారా?
TeluguStop.com
తమిళ స్టార్ దర్శకుడు శంకర్( Director Shankar ) దర్శకత్వంలో రామ్ చరణ్ కియారా అద్వానీ కలిసిన నటించిన చిత్రం గేమ్ చేంజర్( Game Changer ).
నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుక జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా బిజీబిజీగా ఉన్నారు.
విడుదల తేదీకి మరి కొద్ది రోజులే సమయం ఉండడంతో మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.
ఈ నెల ఆఖరిలో లేదంటే వచ్చినలో ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
"""/" /
శంకర్ దర్శకత్వం వహించిన గత చిత్రం ఇండియన్ 2 భారీగా ప్లాప్ అవడంతో ఈ సినిమాను చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని మరీ చేస్తున్నారు.
కచ్చితంగా రామ్ చరణ్( Ram Charan
) కెరియర్ లోనే ఈ చిత్రం బెస్ట్ మూవీ అవుతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.
ఇప్పటికే ఈ సినిమాపై వచ్చిన రివ్యూలు సినిమా నుంచి వచ్చిన అప్డేట్లు ఇలా ప్రతి ఒక్కటి మాపై భారీగా అంచనాలను క్రియేట్ చేశాయి.
కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారు.తండ్రి కొడుకులుగా రెండు పాత్రలు చేస్తోన్న సంగతి తెలిసిందే.
యంగ్ రామ్ చరణ్ క్యారెక్టర్ కి జోడీగా కియారా అద్వానీ కనిపించబోతోంది.అలాగే తండ్రి పాత్రకి జోడీగా అంజలి నటించింది.
ఈ సినిమాలో ఆమె పాత్రని ఇప్పటి వరకు శంకర్ రివీల్ చేయలేదు. """/" /
సాంగ్స్ అన్ని కూడా ఆల్ మోస్ట్ కియారా అద్వానీ ( Kiara Advani )తోనే ఉన్నట్లు చూపించారు.
అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అంజలి, రామ్ చరణ్ పై ఒక సాంగ్ ఉంటుందని సమాచారం.
ఈ చిత్రంలో అంజలి క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉంటుందని ఇప్పటికే డైరెక్టర్ శంకర్ తెలిపారు.
అందుకే ఆమె పాత్రని పూర్తిగా రివీల్ చేయకుండా సర్ప్రైజింగ్ గా ఉంచినట్లు కొందరు చెబుతున్నారు.
సినిమాలో స్టోరీని మలుపు తిప్పే క్యారెక్టర్ లో అంజలి కనిపిస్తుందట.చాలా కాలం తర్వాత అంజలి తెలుగులో చేస్తోన్న పెద్ద సినిమా ఇదే.
సినిమాలలో ఆమె పాత్రలో ఏదో ప్రత్యేకత ఉంటేనే తప్ప అంజలి సాధారణంగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు.
శంకర్ కూడా తన సినిమాలలో హీరోయిన్ల పాత్రలను బలంగా చూపిస్తాడు.ఏదో గ్లామర్ పరంగా వచ్చిపోయే తరహాలో హీరోయిన్లను శంకర్ ఎప్పుడు చూపించరు.
అలాగే గేమ్ చేంజర్ లో కూడా అంజలి పాత్రని చాలా బలంగా డిజైన్ చేశారనే టాక్ వినిపిస్తోంది.
మూవీ కథలో అసలైన గేమ్ చేంజర్ గా ఆమె ఉండబోతోందట.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మరి ఈ సినిమాలో అంజలి పాత్ర ఎలా ఉండబోతుంది అన్న విషయం తెలుసుకోవడానికి అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు.
వైరల్ వీడియో: అరటిపండ్లు అమ్మే వ్యక్తి దేశ పరువు మంటకలిపాడుగా!