అంజలిలో అది నచ్చడం వల్లే ఎఫ్ 3 మూవీలో ఆఫర్ వచ్చిందట

సినిమా పరిశ్రమ అనేది గ్లామర్ ప్రపంచం.సినిమా పరిశ్రమలో ఒక్క వెలుగు వెలగాలని కొన్ని కోట్ల మంది ఆశ పడుతుంటారు.

కాని ఆ అదృష్టం కొంత మందికే దక్కుతుంది.ముఖ్యంగా హీరోయిన్ ల విషయంలో గ్లామర్ ప్రపంచం కాబట్టి గ్లామర్ తోనే సక్సెస్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చే వారు ఉంటారు.

కాని అలాంటి వారు సినిమా పరిశ్రమలో ఎక్కువ కాలం నిలబడలేరు.అలా వచ్చి ఇలా వెళ్లిన హీరోయిన్ లు ఎంతో మంది ఇప్పుడు కనుమరుగయ్యారు.

కాని తమ అందచందాలతో కుర్రకారుకు మత్తెక్కించి, నటనా ప్రాధాన్యత గల పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకున్న నటులె సినిమా పరిశ్రమలో చాలా కాలం కొనసాగగలుగుతారు.

అలా అందం, అభినయం కలగలిసి ఉన్న హీరోయిన్ లలో మొదటి వరుసలో ఉంటారు నటి అంజలి.

తెలుగు పరిశ్రమలో ప్రవేశించిన కొత్తలో ఒకటి రెండు సినిమాలు చేసినా అంజలినిని స్టార్ హీరోయిన్ గా మార్చిన సినిమా దిల్ రాజు నిర్మాతగా వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.

ఇక ఆ సినిమాతో భారీగా ఆఫర్లు వచ్చినా అంజలికి మరో బ్రేక్ ఇవ్వ లేకపోయింది.

తాజాగా వకీల్ సాబ్ తో మరో సారి అంజలి సూపర్ హిట్ అందుకుంది.

అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత దిల్ రాజు నిర్మాతగా వస్తున్న ఎఫ్-3 సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది.

అయితే ఈ ఎఫ్-3 సినిమాలో ఆఫర్ రావడానికి వకీల్ సాబ్ లో అంజలి చేసిన నటనకి ఫిదా అయిన నిర్మాత దిల్ రాజు ఎఫ్-3 మూవీలో ఛాన్స్ ఆఫర్ చేశారట.

విశ్వం సినిమా సక్సెస్ తోనే సమాధానం చెప్తాం అంటున్న గోపిచంద్…