షూటింగ్ లో పవన్ కళ్యాణ్ ఎలా ఉంటాడంటే?...అంజలి కామెంట్స్

పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు సినీ జనాల్లో మారు మ్రోగుతోంది.పవన్ కళ్యాణ్ అంటే ఒక పేరు కాదు ఒక బ్రాండ్ అనేది మనం కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు.

ఎందుకంటే హీరోలకు అభిమానులు ఉండటం సహజం.కాని పవన్ కళ్యాణ్ కు భక్తులు ఉంటారు.

అందుకే సినిమాలు ఫ్లాప్స్, హిట్స్ తో సంబంధం లేకుండా అలా అభిమానులు పెరుగుతూ ఉంటారు తప్ప తగ్గే సమస్యే ఉండదు.

అంతలా అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు పవన్ కళ్యాణ్.అయితే ఏప్రిల్ 9 న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా విడుదల కాబోతోంది.

ఈ సందర్భంగా వకీల్ సాబ్ ప్రమోషన్ లో భాగంగా పవన్ కళ్యాణ్ పై నటి అంజలి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.

పవన్ కళ్యాణ్ షాట్ లో ఉంటే తన పాత్ర మీద దృష్టి పెడుతూ సినిమా ధ్యాస లో ఉంటాడని, తనకు సీన్ లేని సందర్భంలో ఒక మూలకు కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటాడని, లేకపోతే నిద్ర పోయి విశ్రాంతి తీసుకుంటాడని నటి అంజలి తెలిపింది.

పవన్ కళ్యాణ్ లాంటి హీరోను నేనెప్పుడూ చూడలేదని, ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో అనందాన్నిచ్చిందని నటి అంజలి తెలిపింది.

వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కోసం అభిమానుల లాగానే నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపింది.

ఆ రీజన్ వల్లే నాకు సౌత్ లో ఆఫర్లు తగ్గాయి.. ఇలియానా షాకింగ్ కామెంట్స్ వైరల్!