యాక్సిడెంట్ అయిన సమయంలో బాలయ్య అలా చేశారు.. నటి కామెంట్స్ వైరల్!

ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన అనితా చౌదరి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలయ్య గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

ఒక వ్యాపారంలో నేను ఇన్వెస్ట్ చేశానని నా బిజినెస్ పార్ట్నర్ కోవిడ్ తో చనిపోయారని ఆమె తెలిపారు.

ఆయన నా ఫ్యామిలీ ఫ్రెండ్ కావడంతో బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయాలని ఉందని అనితా చౌదరి వెల్లడించారు.

ప్రొడక్షన్ అనేది కిల్లర్ లాంటిదని ఆమె పేర్కొన్నారు.నేను ఏదైనా బాధ్యత తీసుకుంటే ఆ బాధ్యతకే పరిమితం అవుతానని అనితా చౌదరి వెల్లడించారు.

ఉయ్యాల జంపాల, గురు, నిర్మలా కాన్వెంట్, మెంటల్ మదిలో సినిమాల్లోని పాత్రలు మంచి పేరు తెచ్చిపెట్టాయని ఆమె వెల్లడించారు.

చాలామంది సెలబ్రిటీలతో పోల్చి చూస్తే నేను ఎక్కువ సినిమాలు చేశానని అనితా చౌదరి అన్నారు.

కార్తికేయ2 సినిమాలో మంచి పాత్ర వచ్చిందని కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో నేను నటించలేదని ఆమె పేర్కొన్నారు.

నేను చేయలేదని ఆ సినిమాలో నా పాత్ర తీసేశారని అనితా చౌదరి అన్నారు.

బొమ్మరిల్లు సినిమాలో సురేఖావాణి పాత్ర నేను నటించాల్సిన పాత్ర అని ఆమె చెప్పుకొచ్చారు.

అమెరికాలో స్ట్రక్ కావడంతో ఆ సినిమాలో ఆమెకు ఛాన్స్ ఇప్పించానని అనితా చౌదరి పేర్కొన్నారు.

ఫన్ డే అవార్డ్స్ షో ఛాన్స్ నేను శిల్పా చక్రవర్తికి ఇప్పించానని అనితా చౌదరి వెల్లడించడం గమనార్హం.

డ్రైవర్ స్పీడ్ బ్రేకర్ ను గుద్దేయడం వల్ల ఒకసారి యాక్సిడెంట్ జరిగిందని ఆమె అన్నారు.

"""/"/ ఇటీవల యాక్సిడెంట్ అయిన సమయంలో బాలకృష్ణగారు హెల్ప్ చేశారని ఆమె చెప్పుకొచ్చారు.

నా క్లోజ్ ఫ్రెండ్ అభిలాష బాలయ్యకు ఫ్యామిలీ ఫ్రెండ్ కావడంతో బాలయ్య ఆ సమయంలో చాలా హెల్ప్ చేశారని అనితా చౌదరి అన్నారు.

బాలయ్య వాళ్ల ఆస్పత్రి నుంచి డాక్టర్లను పిలిపించి చికిత్స చేయించారని ఆమె తెలిపారు.

బాలయ్య గురించి గొప్పగా అనితా చౌదరి చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?