తల్లి కాబోతున్న తెలుగు హీరోయిన్‌

అలియాస్‌ జానకి చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయిన ముద్దుగుమ్మ అనిషా ఆంబ్రోస్‌ ఆ తర్వాత చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్‌లు దక్కించుకోలేదు.

పవన్‌ కళ్యాణ్‌ సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ సినిమాలో మొదట ఈమెనే హీరోయిన్‌గా అనుకున్నారు.కాని కొన్ని కారణాల వల్ల ఆమెను తొలగించి కాజల్‌ను నటింపజేశారు.

ఆ సినిమాతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదుగుతుందని అంతా భావించారు.కాని ఆమెకు నిరాశే మిగిలింది.

హీరోయిన్‌గా కొన్నాళ్లు ప్రయత్నాలు చేసిన ఈ అమ్మడు పెళ్లి చేసుకుంది.రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారవేత్త గుణను గత ఏడాది మే లో పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం తల్లి కాబోతుంది.

ఈ విషయాన్ని బుల్లి తెర సెన్షేషన్‌గా గుర్తింపు దక్కించుకున్న తేజస్వి మడివాడ పేర్కొంది.

తన ఆప్తమిత్రురాలు అనీషా ఆంబ్రోస్‌ తల్లి కాబోతుంది అంటూ ఫొటోలు షేర్‌ చేసి మరీ చెప్పింది.

ఆ ఫొటోలో గుణ తన భార్య అనీషా ఆంబ్రోస్‌ బేబీ బంప్‌పై ముద్దు పెడుతూ కనిపించాడు.

తేజస్వి పోస్ట్‌ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. """/"/ హీరోయిన్‌గా పలు ప్రయత్నాలు చేసిన అనీషా కు పెద్దగా ఛాన్స్‌లు దొరకలేదు.

దాంతో ఆమె వైవాహిక జీవితంలో అడుగు పెట్టింది.హీరోయిన్‌గా ఛాన్స్‌లు రాని సమయంలో అనవసరంగా టైం వేస్ట్‌ చేయకుండా వెంటనే పెళ్లి చేసుకుని హాయిగా సెటిల్‌ అవ్వడం మంచిది.

ఇలా అనీషా మాదిరిగా అంతా ఉండాలంటున్నారు.కొందరు మరీ టూ మచ్‌గా సంవత్సరాలకు సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు.

ఆఫర్లు లేకున్నా అడ్డదారిలో కొనసాగుతూ ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్నారు.

నా కూతురికి నేనిచ్చే పెద్ద బహుమతి అదే.. రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!