మామ రజనీకాంత్ పై ఆ విధంగా ప్రేమను చాటుకున్న అనిరుధ్.. అసలేం జరిగిందంటే?

ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నారు అనిరుధ్.

ప్రస్తుతం చేతినిండా బోలెడు సినిమా అవకాశాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.తమిళం హిందీ తెలుగు అని భాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటున్నారు.

ఇక సినిమాలకు మంచి మంచి మ్యూజిక్ ని అందించడంతోపాటుగా పాటలతో సినిమాల హైప్ ని మరింత పెంచుతున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాకు కూడా సంగీతాన్ని అందించిన విషయం తెలిసిందే.

అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా వేట్టయాన్ సినిమా( Vettaiyan Movie )కు కూడా మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.

"""/" / కాగా ఇటీవల ఈ సినిమా నుంచి మనసిలాయో అంటూ ఒక పాట లాంచ్ చేస్తే అది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది.

రజినీకాంత్ అంటే అనిరుధ్‌ కు ఎంత ప్రేమ అన్నది తన సంగీతంలో తెలుస్తోంది.

అలాగే స్టేజ్ మీద కూడా తన ప్రేమను బలంగా చాటారు అనిరుద్.రజినీ సినిమాల ఆడియో వేడుకల్లో అతను ఇచ్చే లైవ్ షోలు, రజినీ గురించి మాట్లాడే మాటలు చూస్తే మామ మీద తనది మామూలు ప్రేమ కాదు అనిపిస్తుంది.

రజినీ భార్య లత సోదరుడి కొడుకే అనిరుధ్( Anirudh ).అయితే మామ అనే కాక నటుడిగా రజినీకి అనిరుధ్ వీరాభిమాని.

ఆ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు.దాంతో మామ పై అలాగే అభిమాన హీరో పై ఉన్న అభిమానాన్ని సంగీతం రూపంలో మాటల రూపంలో ఎప్పటికప్పుడు చూపిస్తూ వస్తున్నారు.

</br """/" / తాజాగా జరిగిన ఆడియో ఫంక్షన్ లో కూడా పాటలతో హోరెత్తించడంతోపాటు స్పీచ్ తో అందరి దృష్టిని ఆకర్షించారు.

తాను బేసిగ్గా జాలీ టైప్ అని అందరికీ తెలుసని, కానీ రజినీ సినిమాకు సంగీతం అందిస్తున్నపుడు, ఆయన సినిమాలు చూస్తున్నపుడు ఎమోషనల్ అయిపోతానని అనిరుధ్ చెప్పాడు.

జైలర్ మూవీకి బ్యాగ్రౌండ్ స్కోర్ చేస్తున్నపుడు తాను కన్నీళ్లు పెట్టుకున్నట్లు చెప్పాడు.ఎప్పటికీ తాను సూపర్ స్టార్‌కు డైహార్డ్ ఫ్యాన్‌గానే ఉంటానని ఒక అభిమానిగానే ఆయన సినిమాలకు సంగీతం అందిస్తానని అన్నార.

అక్రమ వలసదారుల బహిష్కరణ .. పనామాలో భారతీయుల అవస్థలు