జోరుమీదున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్.. ఒకేసారి 8 సినిమాలతో సెన్సేషన్!

కోలీవుడ్ ( Kollywood ) ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకెళ్తున్న యంగ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఎవరు అంటే ''అనిరుద్ రవిచందర్'' ( Anirudh Ravichander ) అనే చెప్పాలి.

ఈయన ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీ లోనే టాప్ 1 లో దూసుకు పోతున్నాడు.

వరుసగా సక్సెస్ ఫుల్ సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించు కున్నాడు.తమిళ్ లో క్రేజ్ రావడంతో ఈయన తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.

ఇక్కడ కూడా ఇప్పుడు వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ ఆకట్టు కోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం అనిరుద్ రవిచందర్ కోలీవుడ్, టాలీవుడ్ లో దాదాపు 8 సినిమాలను ఒకేసారి లైన్లో పెట్టాడు అంటే ఈయన క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ప్రెజెంట్ తమిళ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాలన్నిటికీ ఈయనే సంగీతం అందిస్తున్నాడు.

"""/" / వాటితో పాటు తెలుగులో కూడా వరుస అవకాశాలు అందుకుంటున్నాడు.ప్రస్తుతం ఈయన ఖాతాలో విజయ్ దళపతి - లోకేష్ లియో మూవీ( Vijay Dalapathy - Lokesh Leo Movie ), నెల్సన్ దిలీప్ కుమార్ - రజినీకాంత్ జైలర్, రజినీకాంత్ - టీజె జ్ఞానవేల్ న్యూ మూవీ, కమల్ హాసన్ - శంకర్ ఇండియన్ 2, అజిత్ - తిరుమేని విడా ముయార్చి ఇంకా షారుఖ్ ఖాన్ - అట్లీ ( Shahrukh Khan - Atlee )జవాన్ సినిమాలు చేస్తున్నాడు.

"""/" / అంతేకాదు తెలుగులో ఎన్టీఆర్ - కొరటాల ఎన్టీఆర్ 30 సినిమా అలానే విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి రాబోయే ప్రాజెక్ట్ లో కూడా ఈయనే ఫిక్స్ అవ్వబోతున్నట్టు టాక్.

ఇలా ఒకేసారి ఇన్ని సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు.ఇవన్నీ భారీ ప్రాజెక్టులే కావడంతో ముందు ముందు మరిన్ని అవకాశాలు అందుకోవడమే కాకుండా పాన్ ఇండియా వ్యాప్తంగా సక్సెస్ సాధించే అవకాశం ఉంది.

ఊపు ఊపేస్తున్న మ్యాడ్ స్క్వేర్ ‘స్వాతి రెడ్డి’.. (వీడియో)