షారుఖ్ ఖాన్ ‘జవాన్’ కోసం అనిరుధ్ అంత రెమ్యునరేషన్ అందుకున్నారా?

కోలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకెళ్తున్న యంగ్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ''అనిరుద్ రవిచందర్( Anirudh Ravichander )'' అనే చెప్పాలి.

ఈయన ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీ లోనే టాప్ 1 లో దూసుకు పోతున్నాడు.

వరుసగా సక్సెస్ ఫుల్ సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించు కున్నాడు.ప్రెజెంట్ తమిళ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాలన్నిటికీ ఈయనే సంగీతం అందిస్తున్నాడు.

"""/" / తమిళ్ లో క్రేజ్ రావడంతో ఈయన తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.

ఇక్కడ కూడా ఇప్పుడు వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ ఆకట్టు కోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం అనిరుద్ రవిచందర్ కోలీవుడ్, టాలీవుడ్ లో దాదాపు డజన్ సినిమాలను లైన్లో పెట్టాడు.

మరి ఈ సినిమాల్లో షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) నటిస్తున్న జవాన్ ఒకటి.

ఈ సినిమాకు కూడా అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. """/" / షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ( Atlee Kumar ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ''జవాన్''.

ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది.ఇక ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతుంది.

విజయ్ సేతుపతి, ప్రియమణి, సునీల్ గ్రోవర్, సన్యా మల్హోత్రా వంటి వారు కీ రోల్స్ పోషిస్తుండగా.

అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.మరి ఈ సినిమాకు అనిరుద్ రెమ్యునరేషన్ రికార్డ్ స్థాయిలో అందుకుంటున్నాడు అని తెలుస్తుంది.

ఇప్పటి వరకు ఏ మ్యూజిక్ డైరెక్టర్ అందుకోనంత రెమ్యునరేషన్ ఈ యంగ్ డైరెక్టర్ అందుకుంటున్నాడట.

ఏకంగా 10 కోట్ల పారితోషికం ఇచ్చారని టాక్.ఇప్పటి వరకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ 8 కోట్లు అందుకుంటూ టాప్ లో ఉండగా ఇప్పుడు అనిరుద్ 10 కోట్ల రెమ్యునరేషన్ తో ఇండియన్ సినిమాల్లోనే ఒక కొత్త శకానికి తెర తీసాడు.

కాటేసిన పామును ప్లాస్టిక్ బ్యాగ్ లో తీసుకొచ్చి ఆస్పత్రిలో గందరగోళాన్ని సృష్టించిన యువకుడు..