అడవుల్లో దాహార్తితో అల్లాడిపోతోన్న జంతువులు, పక్షులు

ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి.అడవుల్లో జంతువులు, పక్షులు దాహార్తితో అల్లాడుతున్నాయి.

వాటిని కాపాడుకునేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది.తాత్కాలిక నీటి వస తులను ఏర్పాట్లు చేసింది.

కవ్వాల్ అభయారణ్యంలో వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలపై భారత్ టుడే రిపోర్ట్.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వేసవి ఎండలు మండుతున్నాయి.భూగర్భజలాలు అడుగంటిపోయాయి.

ఎండలకు తట్టుకోలేక మనుషులే తల్లడిల్లిపోతున్నారు.అడవుల్లో జీవించే జంతువులు, పక్షులు దాహార్తితో తండ్లాతున్నాయి.

దీంతో మూగజీవాలను కాపాడేందుకు అటవీశాఖ అధికారులు నడుం బిగించారు.అడవుల్లో సహజ నీటి ఆనవాళ్లను వెతికి జంతువుల దాహార్తి తీర్చడానికి తాత్కాలిక నీటి వసతులను ఏర్పాటు చేశారు.

కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రంలో పులులతో పాటు చెంగున ఎగిరే జింక పిల్లలు, వేగంగా పరుగెత్తే చిరుత పులులకు కొదువ లేదు.

కొండ గొర్రె లు, నీలుగాయి, అడవిపందులు, సాంబారు, ఎలుగుబంట్లు, మేకాలు, రేసుకుక్కలు, తోడేళ్ళు, పిల్లులు, కంజుపిట్టలు, గద్దలు, కొంగలు, మైనాలు, పావురాలు, పిచ్చుకలు తదితర ప్రాణులు జీవిస్తున్నాయి.

"""/" / ప్రస్తుతం అడవి మధ్యలో సాసర్‌వెల్స్‌ నిర్మించి రోజు నీటి ట్యాంకు ద్వారా నీళ్లు పోయడం వల్ల జంతువులు దాహార్తిని తీర్చుకుంటున్నాయి.

అలాగే సహజ నీటివనరులను గుర్తించి వాటిలోని నీరు జంతువులు తాగే విధంగా అధికా రులు ఏర్పాట్లు చేశారు.

సహజ వనరులు అందు బాటులో లేని ప్రాంతాల్లో సిమెంట్ కట్టడాలను నిర్మించారు.జంతువులు దాహార్తిని తీర్చుకోవడా నికి అడవిలో మైళ్ళ కొద్ది పరుగెత్తుతాయి.

ఆయా బీట్లలోనే సోలార్ పంపు సెట్లను ఏర్పాటు చేసి నీటి ఆవాసాలను ఏర్పాటు చేస్తున్నారు.

"""/" / అదేవిధంగా వేటగాళ్ళ బారి నుంచి జంతువులను పక్షులను కాపాడేందుకు నిఘా వ్యవస్థను మరింతగా ఏర్పాటు చేశఆరు.

వేటగాళ్ళు నీటి ఆవసలవద్దకు రాకుండా ప్రతెకమయిన చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనికిలు చేపడుతున్నారు.

నీరుతాగడానికి ఏయే జంతువులు, పక్షులు వస్తున్నాయో తెలుసుకోవడానికి ప్రత్యేకమయిన కెమెరాలను బిగించి రోజువారీగా తనిఖీలు చేస్తున్నారు.

కవ్వాల్ అడవుల్లో అటవీ శాఖ అధికారులు చేపట్టిన చర్యలతో వన్యప్రాణులకు కొంత నీటి కొరత తీరింది.

అలాగే వన్యప్రాణులకు రక్షణ కరువు కూడా తీరిపోయింది.

అండర్ ఆర్మ్స్ తెల్లగా, మృదువుగా మారాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి!