అన్ స్టాపబుల్ షోకు ‘యానిమల్’ టీమ్.. ఇది బాలయ్య రేంజ్!
TeluguStop.com
నందమూరి బాలకృష్ణ ( Balakrishna )వరుస సినిమాలు చేస్తూనే ఒక టాకింగ్ షోకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే.
అన్ స్టాపబుల్ షోతో బాలయ్య మొదటిసారి వ్యాఖ్యాతగా మారిపోయాడు.ఈ షో సీజన్ 1 ఘన విజయం సాధించింది.
సీజన్ 1 అనుకున్న దాని కంటే ఎక్కువ విజయం సాధించడంతో పార్ట్ 2 స్టార్ట్ చేసారు.
ఆహా వారు పార్ట్ 2 కూడా గ్రాండ్ గా స్టార్ట్ చేసారు చేసి ఈ మధ్యనే ముగించారు.
ఇందులో పొలిటికల్ టచ్ కూడా ఇచ్చారు.రెండు సీజన్స్ గ్రాండ్ గా ముగించడంతో బాలయ్య హోస్ట్ గా కూడా సక్సెస్ అనిపించుకున్నారు.
ఇదిలా ఉండగా ఇటీవలే మూడవ సీజన్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేసారు మేకర్స్.
"""/" /
ఈ సీజన్ లిమిటెడ్ ఎడిషన్ ఫస్ట్ ఎపిసోడ్ లో 'భగవంత్ కేసరి' టీమ్ ఎంట్రీ ఇచ్చి అందరిని ఆకట్టుకుంది.
ఈ ఎపిసోడ్ తో ఈ సీజన్ స్టార్ట్ కాగా ఇది హిట్ అయ్యింది.
ఇక లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ సీజన్ లో నెక్స్ట్ ఎపిసోడ్ కు బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, రష్మిక మందన్నలు యానిమల్ ( Animal Movie) మూవీ టీమ్ రానున్నట్టు తెలుస్తుంది.
"""/" /
కాగా హీరో రణబీర్ ( Ranbir Kapoor ), హీరోయిన్ రష్మిక ( Rashmika Mandanna ) తో పాటు ఆ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ( Sandeep Reddy Vanga ) కూడా సందడి చేయనున్నారట.
అతి త్వరలోనే వీరి ప్రత్యేక ఎపిసోడ్ కూడా గ్రాండ్ గా షూట్ కానుందని టాలీవుడ్ వర్గాల నుండి క్రేజీ టాక్ వైరల్ అవుతుంది.
మరి యానిమల్ సినిమా డిసెంబర్ 1న గ్రాండ్ గా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో తెలుగులో కూడా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
మరి అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లో ఈ సినిమా టీమ్ సందడి చేస్తే తెలుగులో కూడా ఈ సినిమాపై అంచనాలు పెరగడం ఖాయం.
చూడాలి ఈ ఎపిసోడ్ ఎప్పుడు ఉంటుందో.
వైరల్: చలికాలంలో కురాళ్లకు హీటేక్కిస్తున్న యువతి.. ఏం చేస్తోందో చూడండి!