యానిమల్ ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే.. రణ్ బీర్ ఖాతాలో ఇండస్ట్రీ హిట్ చేరినట్టేనా?

రణ్ బీర్ కపూర్( Ranbir Kapoor ) సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కిన యానిమల్ మూవీ( Animal Movie ) థియేటర్లలో విడుదలైంది.

తండ్రీకొడుకుల అనుబంధాన్ని కొత్తగా ఆవిష్కరిస్తూ తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది.

అటు రణ్ బీర్ ఇటు సందీప్ ఖాతాలో ఇండస్ట్రీ హిట్ చేరినట్టేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి 3 గంటల 21 నిమిషాల నిడివితో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తోంది.

తండ్రిపై ఎంతో ప్రేమ ఉన్న కొడుకు తండ్రి కోసం ఎంత క్రూరంగా మారాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

రణ్ బీర్ తన అభినయంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.అర్జున్ రెడ్డిని మించిన సక్సెస్ సందీప్ కు సొంతమైంది.

రణ్ బీర్ రష్మిక మధ్య రొమాంటిక్ సీన్లు సైతం అదిరిపోయాయి.రొమాన్స్ అంటే ఏంటో ఈ సినిమాతో చూపిస్తానని చెప్పిన రణ్ బీర్ ఆ మాటను నిలబెట్టుకున్నారనే చెప్పాలి.

"""/" / ఈ సినిమా అద్భుతంగా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ మూవీ పక్కా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు మంచి లాభాలను అందించడం ఖాయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

బాలీవుడ్ ( Bollywood )అభిమానులకు సైతం ఈ సినిమా ఎంతో నచ్చేసింది.సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాతో దర్శకునిగా మరో పది మెట్లు పైకి ఎదిగారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

"""/" / రణ్ బీర్ తర్వాత సినిమాలతో సైతం బాక్సాఫీస్ ను షేక్ చేయాలని అభిమానులు ఫీలవుతున్నారు.

యానిమల్ మూవీకి సీక్వెల్ తెరకెక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

రణ్ బీర్ యానిమల్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తారో చూడాల్సి ఉంది.

రణ్ బీర్ కపూర్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

ఫ్యామిలీతో వెకేషన్ లో చిల్ అవుతున్న బన్నీ… ఫోటోలు వైరల్!