బాలీవుడ్ లో పాగా వేస్తున్న సందీప్ రెడ్డి వంగా…

అర్జున్ రెడ్డి( Arjun Reddy ) సినిమా డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం బాలీవుడ్ లో రణబీర్ కపూర్ ని హీరోగా పెట్టి ఎనిమల్ అనే సినిమా తీస్తున్నాడు.

సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రూపుదిద్దుకుంటుంది ఇప్పటికి ఈ సినిమా మీద హిందీ, తమిళం,తెలుగులో మంచి అంచనాలు ఉన్నాయి.

అయితే ఇవాళ్ల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఒకటి రిలీజ్ అయింది.దీన్ని కనక మనం అబ్జర్వ్ చేస్తే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎనిమల్( Animal ) లాగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.

"""/" / ఆయనకు సంబంధించిన ఈ క్యారెక్టర్ లో చాలా రకాలైన షేడ్స్ కూడా కనిపిస్తున్నాయి.

ఇక ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తూనే అర్జున్ రెడ్డి లాంటి సినిమా తీసిన సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) డైరెక్షన్ లో వస్తున్న ఇది కంప్లీట్ రా సినిమా గా తెలుస్తుంది.

ఈ సినిమా కనుక హిట్ అయితే సందీప్ రెడ్డి బాలీవుడ్ లోనే టాప్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందుతాడు.

ఇక ఈ సినిమాతో సౌత్ డైరెక్టర్ వెళ్లి బాలీవుడ్ లో సెటిల్ అవుతాడని చెప్పాలి ఇక ఇప్పటికే సందీప్ స్టార్ హీరోలతో సినిమా చేస్తున్నాడు.

సందీప్ అనే కాదు చాలా మంది సౌత్ డైరెక్టర్లు,బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు.

"""/" / ఇక ఇప్పటికే అట్లీ షారుక్ ఖాన్ తో జవాన్( Atlee Jawan ) అనే సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.

అలాగే సందీప్ కూడా ఈ సినిమాతో హిందీలోనే ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత సందీప్ ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు.

అయితే ప్రస్తుతం ఆయన ఎనిమల్ అనే మూవీ మీదనే తన ఫుల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆయన ప్రభాస్ తో చేయాల్సిన స్పిరిట్ సినిమా( Spirit ) పనులు చూసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది.

మొటిమల్లేని మెరిసే చర్మం కోసం ఈ మ్యాజికల్ రెమెడీని ప్రయత్నించండి..!