మహేష్ ఫాన్స్ కి ప్రామిస్ చేసి మాట నిలబెట్టుకున్నావు
TeluguStop.com
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు.
ఈ చిత్ర సహా నిర్మాత అనిల్ సుంకర దేవి శ్రీ ప్రసాద్ కు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసారు.
ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతుంది.పూర్తి వివరాలోకి వెళ్ళితే.
సూపర్ స్టార్ మహేష్ బాబు తో దేవి శ్రీ ప్రసాద్ ఇంతకు ముందు మహార్షి అనే చిత్రానికి సంగీతం అందించాడు.
ఆ చిత్రంలోని స్వరాలను ప్రేక్షకులను మరియు మహేష్ బాబు ఫాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
'సరిలేరు నీకెవ్వరు' చిత్రం యొక్క ప్రారంబోత్సవ సమయంలో దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.
మహేష్ ఫాన్స్ కొంత మంది నా దగ్గరకు వచ్చి మీ మాస్ సాంగ్స్ చాల బాగుంటాయి.
"""/"/మహేష్ బాబుతో ఎలాగైనా ఓ మాస్ సాంగ్ ను కంపోస్ చెయ్యాలని అడిగారని దేవి చెప్పాడు.
నేను మహేష్ అభిమానులకు, సినిమా ప్రేక్షకులకు ప్రామిస్ చేస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో అదిరిపోయే ఓ మాస్ సాంగ్ చేస్తాను, ఆ సాంగ్ తో మిమ్ములను ఉర్రుతలు ఉగిస్తాను ఇదే నా ప్రామిస్ అన్నారు.
తాజాగా సరిలేరు నీకెవ్వరు చిత్రంలో దేవి శ్రీ ప్రసాద్ ఓ మాస్ సాంగ్ ను కంపోస్ చేశాడంట.
ఆ సాంగ్ ను, అనిల్ సుంకర విని దేవి శ్రీ ప్రసాద్ ఆప్పుడు చెప్పిన ప్రామిస్ వీడియోను మరోసారి పోస్ట్ చేసాడు.
దేవి నువ్వు మహేష్ ఫాన్స్ కి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నావు.మాస్ సాంగ్ మాత్రం కేక, ఈ మాటకూడా నీకు చిన్నది అవ్వుతుంది.
ఇంతమంచి మాస్ బీట్ ను ఇచ్చినందుకు చాల థాంక్స్ అన్నారు.అలాగే చిత్రా దర్శకుడు అనిల్ రావిపూడి కూడా దేవి కి కృతజ్ఞతలు తెలియజేశాడు.
జనవరి నెల బాక్సాఫీస్ రివ్యూ ఇదే.. మొత్తం సినిమాల్లో ఎన్ని సినిమాలు హిట్ అంటే?