నీ ఇంటి పేరు ఏంటీ…. కూతురు సుస్మితను ప్రశ్నించిన చిరు.. అసలేం జరిగిందంటే!
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తన 157వ సినిమా పూజా కార్యక్రమాలు ఉగాది పండుగను పురస్కరించుకొని ఎంతో ఘనంగా జరిగాయి.
రామనాయుడు స్టూడియోలో అనిల్ రావిపూడి (Anil Ravipudi)చిరంజీవి కాంబినేషన్లో రాబోతున్న సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
ఇక ఈ కార్యక్రమానికి పలువురు సినీ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు.అయితే ఈ పూజ కార్యక్రమాలలో భాగంగా అనిల్ రావిపూడి ఈ సినిమాని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ ఒక వీడియోని విడుదల చేశారు.
సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాకుండానే అనిల్ రావిపూడి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టారని చెప్పాలి.
మనం సినిమా ఎంత అద్భుతంగా చేసిన సరైన ప్రమోషన్ లేకపోతే సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదని చెప్పాలి.
ఇలా సినిమాలను ప్రమోట్ చేయడంలో అనిల్ రావిపూడి తనదైన శైలిలోనే ముందుకు వెళుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈయన ఒక వీడియోని షేర్ చేశారు.ఈ సినిమా కోసం పని చేస్తున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చిరంజీవి ఒక్కో సినిమా కటౌట్స్ పెట్టుకొని చిరంజీవితో ఎంతో సరదాగా మాట్లాడుతూ కనిపించారు.
"""/" /
ఈ క్రమంలోనే నిర్మాతలు శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా కటౌట్ పెట్టుకొని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల వారిని వారు పరిచయం చేసుకున్నారు.
ఇన్ ఫ్రెంట్ దేర్ ఈజ్ బ్లాక్ బస్టర్ ఫెస్టివల్ అని సుస్మిత డైలాగ్ చెబుతుంది.
నా పేరు సుస్మిత(Susmitha) కొణిదెల.ఈ చిత్రానికి నిర్మాతని అని చిరంజీవినీ పరిచయం చేసుకుంటుంది.
దీంతో చిరంజీవి ఆ ఇంటి పేరు ఏంటి ఇంకోసారి చెప్పు అని అడుగుతారు.
సుస్మిత కొణిదెల (Konidela)అని చెప్పగానే వెంటనే చిరంజీవి ఆ పేరు నిలబెట్టాలి అని ఆల్ ది బెస్ట్ చెప్పారు.
"""/" /
ఇక గ్యాంగ్ లీడర్ కటౌట్ వద్ద చివరిగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఉంటారు.
అక్కడికి వెళ్లిన చిరు ఈ గ్యాంగ్ అంతటికి నువ్వే కదా లీడర్ అంటూ మాట్లాడుతారు.
వచ్చే సంక్రాంతికి ఏం ప్లాన్ చేస్తున్నావ్ అని చిరంజీవి అడగగా.మనం బాక్సాఫీస్ ని రఫ్ఫాడించేద్దాం సార్ అంటూ అనిల్ రావిపూడి సరదాగా మాట్లాడుతూ కనిపించారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.