నా తొత్తర వల్లే ఎన్టీయార్ తో సినిమా చేయలేక పోయాను అంటున్న అనిల్ రావిపూడి…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లకి చాలా మంచి గుర్తింపైతే ఉంది.ఎందుకంటే వాళ్ళు చేసే సినిమాలు సగటు ప్రేక్షకులందరిని ఆకట్టుకుంటూ ఉంటాయి.
ఇక ఎక్స్పరిమెంటల్ సినిమాలు చేయకుండా సేఫ్ జోన్ లో సినిమాలను చేసి స్టార్ హీరోలతో అవకాశాలను అందుకుంటున్న వారు కూడా కమర్షియల్ డైరెక్టర్లే కావడం విశేషం.
ఇక ఇలాంటి సందర్భంలోనే అనిల్ రావిపూడి( Anil Ravipudi ) లాంటి కమర్షియల్ డైరెక్టర్ వరుసగా 8 విజయాలను సొంతం చేసుకుని తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడు.
ప్రస్తుతం ఆయన చిరంజీవితో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.మరి ఇలాంటి సందర్భంలోనే పటాస్ సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత ఆయన ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాల్సి ఉందట.
నిజానికి ఎన్టీఆర్ కూడా అతనితో ఒక సినిమా చేయాలనే ప్రణాళికలు రూపొందించాడు.కానీ అనిల్ రావిపూడి ఎన్టీఆర్ కోసం వెయిట్ చేయకుండా 'సుప్రీమ్' ( Supreme ) అనే సినిమా స్టోరీని రాసుకొని సాయి ధరంతేజ్ ( Sai Dharam Tej )తో ఆ సినిమాని తెరకెక్కించాడు.
ఇక దాంతో అప్పటినుంచి ఎన్టీఆర్ ( NTR ) డైరీ అయితే ఖాళీ లేకుండా అయిపోయింది.
రెండోవ సినిమా కే ఎన్టీయార్ తో సినిమా చేయడానికి అవకాశం వచ్చిందని కొద్ది రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుందని చెప్పడంతో పెద్ద హీరోల సినిమాలకు చిన్న డైరెక్టర్లను వెయిట్ చేయిస్తూ ఉంటారు.
ఫైనల్ గా సినిమా ఉంటుందో ఉండదో అనే ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది.
కాబట్టి నేను కూడా అదే ధోరణిలో ఆలోచించి ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందో ఉండదో ఇక్కడ టైమ్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని నా తొత్తర వల్ల నేను సాయి ధరమ్ తేజ్ తో సుప్రీమ్ అనే సినిమా చేశాను అంటూ అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూ లో తెలియజేశాడు.
"""/" /
ఇక అప్పటి నుంచి ఎన్టీఆర్ చాలా బిజీ అయిపోవడంతో మళ్ళీ మా కాంబినేషన్ అయితే వచ్చే అవకాశం లేకుండా పోయింది ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియాలో తనకంటూ ఒక సత్తా చాటే ప్రయత్నంలో ఉన్నాడు.
కాబట్టి ఇప్పుడు ఆయనతో నేను సినిమాలు చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని అంటూ అనిల్ రావిపూడి చెప్తూ ఉండడం విశేషం.
"""/" /
మరి ఏది ఏమైనా కూడా ఎన్టీఆర్ లాంటి ఒక స్టార్ హీరో తో అవకాశం వచ్చినప్పుడు ఆయన కోసం వెయిట్ చేయకుండా చిన్న హీరోలతో సినిమాలు చేసుకుంటూ రావడం పట్ల అనిల్ రావిపూడి కూడా కొంచెం రిగ్రెట్ ఫీల్ అయినట్టుగా తెలియజేశాడు.
మరి ఏది ఏమైనా కూడా ఎన్టీఆర్ తో అవకాశం వస్తే మాత్రం మంచి స్టోరీ తో సినిమా చేస్తాను అంటూ ఆయన చెబుతూ ఉండటం విశేషం.
విశ్వంభర సినిమాలో వీణ సాంగ్.. వింటేజ్ చిరంజీవి కచ్చితంగా కనిపించనున్నారా?