అనీల్ రావిపూడి ఇంతలో ఎంత మార్పు!
TeluguStop.com
గత ఎడాది ఎఫ్ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనీల్ రావిపూడితో ఆ సమయంలో పలువురు స్టార్ హీరోలు సినిమాలు చేయాలని ఆశపడ్డారు.
కాని ఆ ఛాన్స్‌ను మహేష్‌బాబుకు అనీల్ రావిపూడి ఇచ్చాడు.సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మహేష్‌బాబుకు ఒక మాస్ కమర్షియల్ చిత్రాన్ని ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించాడు.
సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తే ఆ స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.
సినిమా అట్టర్ ఫ్లాప్ అయితే కాదు, కాని దర్శకుడు అనీల్ రావిపూడి చేసిన తప్పులతో సినిమా ఫలితం మారిపోయింది అంటూ విమర్శలు వస్తున్నాయి.
ఆ కారణంగానే సినిమాకు వసూళ్లు తక్కువ వస్తున్నాయి అంటున్నారు.సరిలేరు నీకెవ్వరు చిత్రం తర్వాత అనీల్ రావిపూడి క్రేజ్ ఇంకా పెరుగుతుందని అంతా భావించారు.
కాని అనూహ్యంగా ఆయనతో సినిమాలు చేయాలంటే హీరోలు వెనుకంజ వేయాల్సిన పరిస్థితి వస్తుంది.
ముఖ్యంగా ఒక హీరో అనీల్ రావిపూడితో చేయాలని ఆశ పడి ఇప్పుడు వెనక్కు తగ్గినట్లుగా సమాచారం అందుతోంది.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2020/01/Anil-Ravipudi-Sarileru-Nikevvaru-Vijaya-Shanthi-Mahesh-అనీల్-రావిపూడి!--jpg"/స్టార్ హీరోలు ప్రస్తుతం ఈయనతో వర్క్ చేసేందుకు ఆసక్తిగా లేని కారణంగా మళ్లీ కొత్త వారితో లేదంటే చిన్న హీరోలతో అనీల్ రావిపూడి తనను తాను మళ్లీ ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం సినీ వర్గాల్లో ఉన్న యంగ్ దర్శకుల్లో అనీల్ రావిపూడి ముందు వరుసలో ఉంటాడని చాలా మంది ఆశించారు.
కాని ఆయనకు నిరాశే మిగిలింది.సరిలేరు నీకెవ్వరు సక్సెస్ అయితే అనీల్ చుట్టు కనీసం అయిదుగురు స్టార్ హీరోల పీఆర్‌లు డేట్ల కోసం ఎదురు చూసేవారు.
ఇంతలో ఎంత మార్పు చూడండి.ఇదే కదా సినిమా ఇండస్ట్రీ అంటే.
బేబీబంప్ తో షాక్ ఇచ్చిన సమంత… వైరల్ అవుతున్న బేబీబంప్ ఫోటో?