సంక్రాంతి హ్యాట్రిక్ నాదే అంటోన్న డైరెక్టర్

టాలీవుడ్‌లో ప్రతి ఏడాది సంక్రాంతి బరిలో వచ్చే సినిమాలను చాలా ప్రత్యేకమైనవిగా చూస్తారు ప్రేక్షకులు.

ఈ సీజన్‌లో వచ్చే సినిమాలను అంత ప్రెస్టీజియస్‌గా తీసుకోవడమే కాకుండా కంటెంట్ కరెక్ట్‌గా ఉంటే అది చిన్నదైనా పెద్దదైనా సక్సెస్‌ను కట్టబెడతారు.

ఇలాంటి కోవలో చిన్న డైరెక్టర్స్ నుండి స్టార్ డైరెక్టర్స్ వరకు అందరూ తమ సినిమాలు ఉండేలా చూసుకుంటారు.

ఇక ఒక్కసారి సంక్రాంతి బరిలో సక్సెస్ అందుకున్న దర్శకుడు మరో సంక్రాంతి సీజన్‌లో కూడా సక్సెస్ అందుకుంటే ఆ డైరెక్టర్‌పై అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

కాగా ఇలాంటి ఫీట్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి సాధించాడు.గతేడాది ఎఫ్2 చిత్రంతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ అందుకున్న అనిల్, ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో సంక్రాంటి డబుల్ సక్సెస్‌ను అందుకున్నాడు.

ఇప్పుడు తన నెక్ట్స్ మూవీని రెడీ చేసి వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు.

ఇప్పటికే ఎఫ్3 సినిమాకు సంబంధించిన స్ర్కిప్టు పనులు చివరి దశకు చేరుకున్నాయని, ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసి సత్తా చాటాలని చూస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో వెంకటేష్ ఖచ్చితంగా నటిస్తున్నాడని తెలుస్తోంది.

తాడిపత్రి ఘర్షణలపై రెండు కేసులు నమోదు