ప్రభాస్ తో సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అనిల్.. అలా చెప్పడంతో?

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి( Anil Ravipudi ) గురించి మనందరికీ తెలిసిందే.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడుగా నెంబర్ వన్ స్థానంలో రాజమౌళి దూసుకుపోతుండగా రెండవ స్థానంలో అనిల్ రావిపూడి ఉన్నారు.

రాజమౌళి ఇప్పటివరకు దర్శకత్వం వహించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే.

అలాగే అనిల్ రావిపూడి ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.

అనిల్ రావిపూడి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఎనిమిది సినిమాలు వ‌చ్చాయి. """/" / మొద‌టి సినిమా ప‌టాస్ నుంచి రీసెంట్ గా వ‌చ్చిన సంక్రాంతికి వ‌స్తున్నాం( Sankranthiki Vasthunnam ) సినిమాల వ‌ర‌కు ప్ర‌తీ సినిమా నిర్మాత‌ల‌కు కాసుల వ‌ర్షం కురిపించింది.

వెంకీ, అనిల్ క‌ల‌యిక‌లో వ‌చ్చిన ఎఫ్2, ఎఫ్3 బ్లాక్ బ‌స్టర్లు అయిన నేప‌థ్యంలో సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాపై ముందు నుంచి ఎక్కువ అంచ‌నాలే ఉన్నాయి.

ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఈ సినిమా ప‌ది రోజుల్లో రూ.

230 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్లు అందుకుని ఇప్ప‌టికీ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది.

రిలీజైన రెండో వారంలో కూడా సంక్రాంతికి వ‌స్తున్నాంకు మంచి ఆక్యుపెన్సీలు ద‌క్కుతుండ‌టంతో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్‌ ను ఇంకా కొన‌సాగిస్తూనే ఉంది.

"""/" / ఈ నేప‌థ్యంలోనే భీమ‌వ‌రంలో సంక్రాంతికి వ‌స్తున్నాం బ్లాక్‌ బ‌స్ట‌ర్ సంబ‌రం పేరుతో ఒక ఈవెంట్ ను నిర్వ‌హించారు.

ఈ ఈవెంట్ కు చిత్ర న‌టీ న‌టులతో పాటూ స్థానిక రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా హాజ‌ర‌య్యారు.

భారీ ఎత్తున జ‌నాలు హాజ‌రైన ఈ వేడుక‌లో డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.

సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాను ఇంత భారీ హిట్ చేసినందుకు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తూ ప్ర‌తీ ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు.

ఈ సినిమా స‌క్సెస్‌ తో నా త‌ర్వాతి సినిమాల విష‌యంలో టెన్ష‌న్ పెరిగింది.

నా సినిమాలు అన్ని చోట్లా బాగా ఆడితే గోదావ‌రి జిల్లాల్లో ఇంకాస్త బాగా ఆడ‌తాయ‌ని ఈ సంద‌ర్భంగా తెలిపాడు అనిల్.

ప్ర‌పంచంలో సంతోషంగా, స‌రదాగా ఉండేవాళ్లంతా గోదావ‌రి జిల్లాల్లోనే ఉంటార‌ని, గోదారోళ్లంటేనే మ‌ర్యాద‌కు మారు పేరు అని అన్నాడు.

ఈ క్ర‌మంలో ఆడియ‌న్స్ నుంచి ప్ర‌భాస్ తో( Prabhas ) సినిమా ఎప్పుడ‌నే ప్ర‌శ్న అనిల్ కు ఎదుర‌వ‌గా, నేను కూడా దాని కోస‌మే ఎదురుచూస్తున్నాన‌ని, మీరంతా గ‌ట్టిగా అనుకుంటే అయిపోతుంద‌ని అనిల్ రావిపూడి తెలిపాడు.

మ‌రి ప్ర‌భాస్ ను డైరెక్ట్ చేయాల‌ని అనిల్ చూస్తున్న ఎదురుచూపుల‌కు ఎప్పుడు తెర ప‌డుతుందో చూడాలి మరి.

మరోవైపు డార్లింగ్ ప్రభాస్ చేతి నిండా బోలెడు పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి5, బుధవారం 2025