నేను కోలుకున్నా.. గుడ్‌ న్యూస్‌ చెప్పిన ఎఫ్ 3 డైరెక్టర్‌

టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తుంది.

పవన్ కళ్యాణ్ నుండి మొదలుకుని నేడు కరోనా బారిన పడ్డ అల్లు అర్జున్‌ వరకు ఎంతో మంది కరోనా బారిన పడుతున్నారు.

కరోనా బారిన పడుతున్న వారు కొందరు ఆసుపత్రికి వెళ్ల కుండానే హోమ్‌ ఐసోలేషన్ తో క్యూర్‌ అవుతున్నారు.

కొందరు మాత్రం ఆసుపత్రికి వెళ్తున్నారు.ఇటీవల కరోనా బారిన పడ్డ దర్శకుడు అనీల్ రావిపూడి కరోనా నుండి కోలుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

తగు జాగ్రత్త లతో తాను కరోనాను జయించాను అంటూ ప్రకటించాడు.ఇలా కరోనా బారిన పడ్డ వారు క్యూర్‌ అయ్యాక మెజేస్ ఇవ్వడం మంచిదని అందరు కూడా తాము తీసుకున్న జాగ్రత్తలు చెబుతూ ఉండాలంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అలా చేయడం వల్ల కరోనా గురించిన భయం జనాల్లో తగ్గుతుంది.ఆ సమయంలో ఏం చేయాలి అనేది వారికి తెలిసి టెన్షన్‌ పడకుండా జాగ్రత్త గా ఉంటారని ఈ సందర్బంగా నెటిజన్స్‌ అభిప్రాయ పడుతున్నారు.

కరోనా కారణంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో ఇబ్బందులు పడుతున్నారు.కనుక కరోనా ఉన్నా లేకున్నా కూడా మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలి.

అనీల్ రావిపూడి అదే విషయాన్ని చెప్పాడు.తాను కరోనా నుండి విముక్తి అయ్యాను.

కరోనా వల్ల నేను ఎక్కువ ఇబ్బంది పడలేదు.కాని నాతో కాంటాక్ట్‌ అయిన వారు కరోనా పరీక్షలు చేయించు కోవాలని మాత్రం సూచించాడు.

ఎఫ్‌ 3 సినిమా షూటింగ్‌ సమయం లో అనీల్ రావిపూడి కి కరోనా సోకి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ఎఫ్‌ 3 సినిమా షూటింగ్‌ ను వచ్చే నెల రెండవ లేదా మూడవ వారం లో మళ్లీ పట్టా లెక్కించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

కొడుకు ఆరోగ్యం కోసం తల్లి ఆరాటం.. స్వామి సేవలో డిప్యూటీ సీఎం సతీమణి.!