తమన్నాతో గొడవపై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి.. ఏం చెప్పారంటే?

టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.వరుస విజయాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడు గా దూసుకుపోతున్నారు అనిల్ రావిపూడి.

పటాస్,సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, ఎఫ్ 3, సరిలేరు నీకెవ్వరు వంటి వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు అనిల్ రావిపూడి.

ఇకపోతే ఇటీవలే విడుదలైన ఎఫ్ 3 సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ ను అందుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

ఇకపోతే అనిల్ రావిపూడి ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.త్వరలోనే తన తర్వాతి సినిమాను ప్రారంభించబోతున్నారు.

తాజాగా మీడియాతో ముచ్చటించింది అనిల్ రావిపూడి తన గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.సక్సెస్ కిక్కు అంటే భయం ఎక్కువగా పెరిగింది.

ఒక సినిమా ఏదైనా తేడా కొడితే, ఇప్పటివరకు పొగిడిన వారే తిడతారో ఏమో అని భయం ఎక్కువగా పెరిగింది అని తెలిపాడు అనిల్.

అలాగే సినీ ఇండస్ట్రీలో తెలిసిన వారు అంటే నాకు మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ ఉన్నాడు.

పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా దర్శకుడు. """/" / ఆయన సినిమాలు చేసే సమయంలోనే షూటింగ్స్ లో వాడిన వస్తువులు తీసుకు వచ్చి మాకు ఇస్తూ ఉండేవారు అని చెప్పుకొచ్చారు అనిల్ రావిపూడి.

కాలేజీలో బ్యాక్ బెంచ్లో కూర్చునే వాడిని, అలా ఒకరోజు కాలేజీ లో ఒక స్కిట్ వేసినప్పటి నుంచి అందరూ నన్ను డైరెక్టర్ అనిల్ రావిపూడి అని పిలిచేవారు అని చెప్పుకొచ్చారు.

నా మొదటి సినిమా పటాస్.పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.

ఆ సినిమాలో కామెడీ కి అన్ని వర్గాల ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అయ్యారు.

ఆ తర్వాత ఎఫ్ 2 ఈ సినిమాతో పూర్తిస్థాయిలో కామెడీ వైపు అడుగులు వేశాను అని అని తెలిపాడు అనిల్ రావిపూడి.

ఇక ప్రస్తుతం బాలకృష్ణ గారితో ఒక యాక్షన్ సినిమా చేయబోతున్నాను.ఆయన బలాన్ని ఆయన అభిమానులను దృష్టిలో పెట్టుకుని కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్గా స్క్రిప్టును సిద్ధం చేశాను అని చెప్పుకొచ్చారు అనిల్ రావిపూడి.

ఇక దర్శకుడిగా చాలు అనుకుంటే దర్శకత్వాన్ని పక్కన పెట్టేసి నటుడిగా మారి పోతాను అని తెలిపారు.

ఎఫ్ 3 ప్రమోషన్స్ లో తమన్నా కనిపించడం లేదు మీకు తమన్నాకు గొడవలు జరిగాయని వార్తలు వినిపించాయి అందులో నిజం ఎంత అని అడగగా.

ఆ విషయంపై స్పందించిన అనిల్ రావిపూడి రక్కెసి,గీకేసి, చొక్క లాగేసి అంటూ తమన్నా అసలు బాగోతాన్ని బయట పెట్టేసాడు.

సుకుమార్ మరోసారి సీక్వెల్ సినిమా చేయనున్నాడా..?