హీరో వెంకటేష్ తో మరో 12 సినిమాలు చేస్తాను…. అనిల్ రావిపూడి కామెంట్స్ వైరల్!

సంక్రాంతి అంటేనే సినిమాలో పండుగ అని చెప్పాలి ఈ పండుగలను పురస్కరించుకొని చిన్న హీరోల నుంచి పెద్ద హీరోలు కూడా తమ సినిమాలను విడుదల చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు ఇక ఇప్పటికే రామ్ చరణ్ బాలకృష్ణ(Ram Charan, Balakrishna) సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఇక జనవరి 14వ తేదీ విక్టరీ వెంకటేష్ (Venkatesh) అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్లో సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vastunnam) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక ఈ సినిమా విడుదలకు మరొక రోజు సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

"""/" / ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vastunnam) అనే సినిమా పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా అని తెలిపారు.

ఈ సినిమా సంక్రాంతి పండుగకు సరిగ్గా సరిపోతుందని అందుకే ఈ పండుగకి విడుదల చేస్తున్నామని తెలిపారు.

ఇక ఎప్పుడైతే హీరో వెంకటేష్ ఇద్దరు హీరోయిన్ల మధ్య ఇబ్బంది పడతారో ఇక ఆ సినిమా సూపర్ హిట్టే.

అలాగే ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

"""/" / ఇక వెంకటేష్ గారితో తనకు ఉన్న అనుబంధం గురించి అనిల్ రావిపూడి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.

వెంకటేష్ గారితో ఇదివరకే ఈయన ఎఫ్2 ఎఫ్3 సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకున్నారు.

ఈ క్రమంలోనే వెంకటేష్ గారితో నాకు చాలా మంచి అనుబంధం ఉందని తెలిపారు.

తాను వెంకటేష్ గారితో మరో 10 లేదా 12 సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ఈ సందర్భంగా అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

అనీల్  దర్శకత్వంలో ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏ సినిమా కూడా అభిమానులను నిరాశపరచలేదు అపజయం ఎరుగని దర్శకుడిగా రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి పేరు సంపాదించారని చెప్పాలి.

ఇక ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైనటువంటి అప్డేట్స్ కనుక చూస్తే సినిమా ఎంతో అద్భుతంగా ఉండబోతుందని స్పష్టమవుతుంది.

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ను ఆ హీరోతో చేయాల్సిందా..?