ఇప్పట్లో అయిపోదంటున్న అనిల్

గతేడాది సంక్రాంతికి రిలీజ్ అయిన ఎఫ్2 చిత్రం ఎలాంటి సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుపించింది.విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన ఈ సినిమా ఫక్తు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించాడు.

ఇక ఈ సినిమా తరువాత మహేష్ స్వయంగా అనిల్ రావిపూడితో సరిలేరు నీకెవ్వరు సినిమా చేయించుకున్నాడు.

అయితే ఎఫ్2 రిలీజ్ సమయంలోనే ఆ సినిమాకు సీక్వెల్ ఉంటుందని చెప్పిన అనిల్ రావిపూడి, ప్రస్తుతం దాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు.

ఎఫ్2 సీక్వెల్‌ అయిన ఎఫ్3లో కూడా అదే హీరోల పాత్రలు ఉంటాయని ఆయన తెలిపాడు.

అయితే ఈ ఎఫ్3 సినిమాతోనే ఈ సినిమా ఆగిపోదని, తరువాత ఎఫ్4, ఎఫ్5 కూడా ఉంటుందని ఆయన అన్నారు.

హీరోల పాత్రలు అవే ఉన్నప్పటికీ కథ పరంగా కొన్ని మార్పులు జరుగుతాయని ఆయన తెలిపాడు.

మొత్తానికి అనిల్ రావిపూడి ఎఫ్3 సినిమాతోనే ఈ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆపేయాలని చూడటం లేదు.

ఇక ఈ సినిమాలో మరోసారి వెంకటేష్, వరుణ్ నటిస్తారని తెలుస్తోంది.మరి వారి సరసన హీరోయిన్లు కూడా పాతవారే ఉంటారా లేక మారుతారా అనేది చూడాలి.

కమలహాసన్ ఇక మీదట హీరోనా..? విలనా..?