శ్రీలీలను సేవ్ చేయడానికి భారీ ఫైట్ చేస్తున్న బాలయ్య!

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi).

ఈయన ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి.దీంతో అనిల్ గ్రాఫ్ కూడా పెరుగుతూ వస్తుంది.

చిన్న హీరోలతో స్టార్ట్ అయిన అనిల్ ప్రయాణం ఏకంగా మహేష్ బాబు లాంటి హీరోను డైరెక్ట్ చేసే అవకాశం అందుకుని ఆయనతో కూడా సూపర్ హిట్ కొట్టాడు.

ఇక ఇప్పుడు నటసింహం నందమూరి బాలయ్యతో(Balakrishna) ప్రస్తుతం సినిమా తీస్తున్నాడు.గత ఏడాది ఎఫ్ 3 సినిమాతో హిట్ అందుకున్న అనిల్ బాలయ్యను ఒప్పించి తనతో ఒక ఎమోషనల్ కథను తీయడానికి సిద్ధం అయ్యాడు.

ఇప్పటికే ఈ సినిమా దాదాపు సగం పూర్తి అయినట్టు తెలుస్తుంది.ఇక ఇప్పుడు శరవేగంగా షూట్ జరుపు కుంటున్న ఈ సినిమా నుండి తాజాగా ఒక అప్డేట్ బయటకు వచ్చింది.

"""/" / 'NBK108' అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఈ నెలలో స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల (Srileela) కనిపిస్తున్న విషయం విదితమే.

ప్రెజెంట్ షెడ్యూల్ లో బాలయ్య - శ్రీలీల మీదనే కొన్ని కీలక ఎమోషనల్ సన్నివేశాలను షూట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

"""/" / అందుతున్న సమాచారం ప్రకారం కిడ్నప్ కు గురి అయిన శ్రీలీలను సేవ్ చేయడానికి బాలయ్య చేసే ఫైట్స్ చాలా వీరోచితంగా ఉండబోతున్నాయట.

చూడాలి మరి వీరి మధ్య వచ్చే ఎమోషనల్ ట్రాక్ ఎలా అలరిస్తుందో.ఇక ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్(Arjun Rampal) నటిస్తుండగా ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.

అలాగే ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.మరి అనిల్ బాలయ్యకు కూడా భారీ హిట్ అందిస్తాడో లేదో వేచి ఉండాల్సిందే.

బెంగళూరులో ఆస్తుల కొనుగోలుపై ఎన్ఆర్ఐల ఇంట్రెస్ట్ .. ఎందుకిలా?