ఈసారి టార్గెట్ మిస్ అయ్యే ఛాన్సే లేదట.. ‘భగవంత్ కేసరి’ అలరించడం ఖాయం!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాకే ''భగవంత్ కేసరి( Bhagavath Kesari )'' అనే టైటిల్ ను బాలయ్య బాబు బర్త్ డే కానుకగా అనౌన్స్ చేసారు.

అలాగే బర్త్ డే రోజు భగవంత్ కేసరి టీజర్ కూడా రిలీజ్ చేయడంతో మాసివ్ రెస్పాన్స్ అందుకుంది.

ఈ టీజర్ అండ్ టైటిల్ కు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. """/" / ఇది చూసిన తర్వాత బాలయ్యకు మరో హిట్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ సంబర పడుతున్నారు.

అఖండ, వీరసింహారెడ్డి వంటి రెండు బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుండి అదిరిపోయే సమాచారం బయటకు వచ్చింది.

"""/" / అనిల్ రావిపూడి ఈ సినిమాను బాలయ్య ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా తెరకెక్కిస్తున్నాడు అని బాలయ్యకు అఖండ లెవల్లో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని యూనిట్ సభ్యులు అంటున్నారు.

అంతేకాదు ఈ సినిమాలో బాలయ్య బాబు విశ్వరూపం చూపిస్తాడని టాక్.ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ ( Kajal Agarwal )హీరోయిన్ గా నటిస్తుండగా.

బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపిస్తున్న విషయం విదితమే.అలాగే ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ ( Arjun Rampal )నటిస్తుండగా ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.

మరి ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఫాస్ట్ గా షూట్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించి ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.

మరి అనిల్ రావిపూడి బాలయ్యకు ఎలాంటి హిట్ అందిస్తాడో లేదో వేచి చూడాలి.

డస్ట్ అలెర్జీ తో బాధపడుతున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!