వచ్చే ఎన్నికల్లో జగన్‌ని గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తాం.. మాజీమంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్

ధన్యవాదాలు తెలిపేందుకే సీఎం జగన్‌ను కలిశానని మాజీమంత్రి అనిల్‌ కుమార్‌ తెలిపారు.జగన్‌లో అనిల్ కుమార్ భేటీ అయ్యారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను జగన్‌ సైనికుడిని మాత్రమేనని చెప్పారు.మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డికి, తనకు కోల్డ్‌ వార్‌ ఏమీ లేదని తెలిపారు.

కుటుంబంలో ఉన్నప్పుడు చిన్న చిన్న లుకలుకలు ఉంటాయని, అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో జగన్‌ని గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు.మళ్లీ అధికారంలోకి వచ్చాక మంత్రులుగా వస్తామని అనిల్‌ కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు.

 .

వైరల్ వీడియో: చావు అంచులదాక వెళ్లి రావడం అంటే ఇదేనేమో