బిగ్ బాస్ కి వెళ్తే కెరియర్ పిప్పి కావాల్సిందే.. దండం పెట్టేసిన యూట్యూబర్!
TeluguStop.com
తెలుగు బిగ్ బాస్ సీజన్ 8( Bigg Boss Telugu 8 ) కార్యక్రమం త్వరలోనే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొనే వారిలో మై విలేజ్ షో అనిల్ గీలా( Anil Geela ) కూడా ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే అయితే తన బిగ్ బాస్ కార్యక్రమానికి వెళుతున్నాను అనే వార్తలపై అనిల్ స్పందించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
"""/" /
బిగ్ బాస్ కార్యక్రమం అనేది ఒక పెద్ద ఎలిమెంట్ ఒక గంటలో కొన్ని కోట్ల మంది మనల్ని చూస్తున్నారు అంటే దానికోసం పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఒక తెలియని పేస్ ను జనాలలోకి తీసుకువెళ్లాలి అంటే బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమం ఫర్ఫెక్ట్ షో అని ఈయన తెలిపారు.
ఇక ఒక నటుడుకి బిగ్ బాస్ కార్యక్రమం ఎంతవరకు ఉపయోగము అనేది చెప్పలేమని ఎందుకంటే గతంలో పాల్గొన్నవారికి బిగ్ బాస్ పెద్దగా ఉపయోగపడలేదని ఈయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
"""/" /
ఒక నటుడు తన నటన ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తుంటారు అలాంటిది బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి తన నిజ స్వరూపం చూసిన తర్వాత ఆయన నటనని ప్రేక్షకులు అంగీకరించలేరని తెలిపారు.
ఎందుకంటే బిగ్ బాస్ అంటే.పర్సనల్ లైఫ్‌ని( Personal Life ) పిప్పిచేసి పారేస్తారు.
ఆ డైలమాలోనే వెళ్లాలా వద్దా? అని ఆలోచిస్తున్నా.నేను ఎక్కడికీ పోయినా బాగానే ఉంటా.
నాకు నచ్చిన విధంగానే నేను ఉంటాను కానీ ప్రజలందరూ చూస్తూ మనల్ని జడ్జ్ చేస్తారనే భయం నాకు ఉంది అంటూ ఈ సందర్భంగా ఈయన బిగ్ బాస్ కార్యక్రమం గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
బిగ్‌బాసుకి ఏమయ్యింది? ఈ ఎంపికలేంట్రా బాబూఅని బోరుమంటున్న ప్రేక్షకులు!