రాజేంద్రనగర్ లో రెచ్చిపోయిన దొంగలు..!!
TeluguStop.com
హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో దొంగలు రెచ్చిపోతున్నారు.ఈ మధ్య రోడ్డుపై మరియు ఇళ్లల్లో చొరబడి వరుసపెట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారు.
ఈ తరహాలోనే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో దొంగలు రెచ్చిపోయారు.కిస్మత్ పూర ఓం నగర్ కాలనీలో ఓ వ్యాపారి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు.
12 తులాల బంగారం, వెండి ఆభరణాలు ఇంకా నాలుగు లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లడం జరిగిందట.
దీంతో పోలీసులు సమాచారం అందుకుని కేసు నమోదు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.గతంలో ఇదే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో చాలా చోరీలు జరిగాయి.
"""/"/
ఈ ప్రాంతంలో దొంగలు అనేకమార్లు దోపిడీకి పాల్పడటం జరిగింది.ఈ ఏడాది ప్రారంభంలోనే జనవరి నెలలో అత్తాపూర్ సమీపంలో సంతోష్ అనే వ్యక్తి పై దొంగలు దాడికి పాల్పడి ₹2.
5 లక్షల విలువైన బంగారాన్ని అపహరించారు.కాగా ఇప్పుడు ఇదే ప్రాంతం కిస్మత్ పూర ఓంనగర్ కాలనీలో.
వ్యాపారి ఇంట్లో దొంగలు దొంగతనానికి పాల్పడటం సంచలనం సృష్టించింది.రాజేంద్రనగర్ లో వరుస చోరీలు స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.
ట్రంప్ దెబ్బకి అమెరికాలో భారీగా పెరుగుతున్న సిజేరియన్లు.. భారతీయ తల్లులు పరుగులెందుకు?