యూకేలో గోమాంసం వడ్డనతో ఆ గుంపు విధ్వంసం.. షాకింగ్ వీడియో లీక్..!!

ఇంగ్లాండ్‌లోని షెఫీల్డ్‌లో( Sheffield ) ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.అబ్బాసిన్ డైనర్( Abaseen Diner ) అనే రెస్టారెంట్‌పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.

ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.భారతీయులని భావిస్తున్న కొందరు వ్యక్తులు రెస్టారెంట్‌లోకి( Restaurant ) చొరబడి యజమానిపై దాడి చేయడంతోపాటు అద్దాలను ధ్వంసం చేశారు.

ఎక్స్, రెడిట్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.

వీడియోలో దుండగులు రెస్టారెంట్ సిబ్బందిపై వస్తువులు విసురుతూ, అసభ్య పదజాలంతో దూషిస్తూ కనిపించారు.

ఒకానొక సమయంలో, ఒక వ్యక్తి దగ్గరున్న కర్రను లాక్కోవడానికి ప్రయత్నించగా, ఆ వ్యక్తి గట్టిగా పట్టుకుని తనను తాను కాపాడుకుంటూ దుండగుల్లో ఒకడి తలపై కొట్టాడు.

ఈ వ్యక్తి రెస్టారెంట్ యజమాని అని, తనను తాను రక్షించుకునే ప్రయత్నంలోనే ఇలా చేశాడని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.ఈ ఘటన మొత్తాన్ని వీడియోలో చూడవచ్చు.

"""/" / మెనూలో గొడ్డు మాంసం( Beef ) వంటకాలు ఉండటమే ఈ దాడికి కారణమని చాలామంది సోషల్ మీడియా యూజర్లు కామెంట్లు చేస్తున్నారు.

అయితే, మరికొందరు మాత్రం ఇది నిజం కాదని వాదిస్తున్నారు.గొడ్డు మాంసం గురించిన ఫిర్యాదులే నిజంగా దాడికి కారణమయ్యాయా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు.

అంతేకాకుండా, ఈ వీడియో, ఆడియోల ప్రామాణికతపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.దీనిపై పూర్తి విచారణ జరగాల్సి ఉంది.

"""/" / ఈ దాడి ఘటనపై పోలీసులు వెంటనే స్పందించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినా, ఆపై వారిని బెయిల్‌పై రిలీజ్ చేశారు.ఈ దాడిలో అద్దాలు, తలుపులు ధ్వంసం కావడంతో సుమారు £2,000 (రూ.

2 లక్షలు) నష్టం వాటిల్లిందని రెస్టారెంట్ యజమాని తెలిపారు.అదృష్టవశాత్తు ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు.

కొన్ని నెలల క్రితమే ప్రారంభమైన ఈ రెస్టారెంట్‌లో గ్రిల్డ్ చికెన్, మటన్, బర్గర్లు, కబాబ్‌లు వంటి వివిధ రకాల మాంసాహార వంటకాలు అందుబాటులో ఉన్నాయి.

ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.దాడి కారణంగా జరిగిన నష్టానికి పరిహారం కోరుతున్నారు రెస్టారెంట్ యజమాని.

ఉషా చిలుకూరి వాన్స్‌పై జాత్యహంకార వ్యాఖ్యలు