అంగన్వాడీలను ఆదుకోవాలి: బీఎస్పీ నేత మేడి ప్రియదర్శిని
TeluguStop.com
నల్లగొండ జిల్లా: అంగన్వాడీ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలుచేసి వారి సమస్యలను పరిష్కరించాలని బహుజన్ సమాజ్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నకిరేకల్ మొయిన్ చౌరస్తాలో అంగన్వాడీ కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరిన సందర్బంగా గురువారం బీఎస్పీ ఆధ్వర్యంలో దీక్షకు సంఘీభావం తెలిపి మాట్లాడుతూ అంగన్వాడీ కార్మికుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని,గత ఎన్నికల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వస్తే గ్రామపంచాయతీ సిబ్బంది,కాంట్రాక్టు, ఔట్సోరిసింగ్,అంగన్వాడీ ఉద్యోగులను ఒక్క సంతకంతో పర్మినెంట్ చేస్తామని ప్రగల్బాలు పలికి,
నేడు అదే కేసీఆర్ హామీలను అమలు చేయకుండా రోడ్డున పడేసే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు.
కేసీఆర్ మెడలు వంచి హక్కులను సాధించేవరకు పోరాటం ఆపొద్దని తెలిపారు.బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ ఆర్.
ఎస్.ప్రవీణ్ కుమార్ అంగన్వాడీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపారని,తాము అధికారంలొకి వస్తే మొదటి సంతకంతోనే అన్ని రంగాల్లో వివిధ హోదాల్లో పనిచేసే కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
మోసం చేసిన కేసీఆర్ దొర పాలనను గద్దెదించి సమిష్టిగా బహుజన రాజ్యం తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్,కేతేపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, యోగి, మహేష్, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు వంటెపాక వెంకటేశ్వర్లు,అంగన్వాడీ టీచర్ హెల్పర్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పొడిశెట్టి నాగమణి,అరుణ,శోభ, చంద్రమ్మ,శుభాషిణి, జయమ్మ,లతిఫ,మంగ, లక్ష్మి,వెంకటమ్మ బీఎస్పీ నాయకులు కార్యకర్తల తదితరులు పాల్గొన్నారు.
కూతురి పేరును రివీల్ చేసిన దీపికా… ఆ పేరుకు అర్థం ఏంటో తెలుసా?