ఉపసర్పంచ్ దంపతుల చొరవతో అంగన్వాడీ తరలింపు నిలిపివేత

హర్షం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు.రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District )ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అంగన్ వాడీ కేంద్రం( Anganwadi ) సెంటర్ కోడ్ నంబర్ 107 ను తరలించడానికి సంబంధిత శాఖ అధికారులు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు.

కాగా ఈ అంగన్ వాడీ కేంద్రం కిషన్ దాస్ పేట,కిష్టంపల్లి రెండు ఆమ్లెట్ గ్రామాలకు అనుకూలంగా ఉంది .

దీనిని ఎల్లారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన పాఠశాలలో కి మార్చడానికి అంగన్వాడీ సూపర్ వైజర్ సరిత ,డి డబుల్ వో లక్ష్మి రాజం మూడు అంగన్ వాడీ సెంటర్ లు ఉన్నత పాఠశాల లో నూతనంగా నిర్మించిన పాఠశాలలో కి మార్చడానికి ప్రయత్నించారు.

కాగా ఇట్టి విషయం అంగన్వాడీ విద్యార్థుల తల్లిదండ్రుల పిర్యాదు మేరకు డి డ బ్లీ ఓ లక్ష్మీరాజం ,అంగన్వాడీ సూపర్ వైజర్ సరిత దృష్టికి తీసుకెళ్ళి కిషన్ దాస్ పేట, కిష్టం పల్లి కి చెందిన అంగన్వాడీ పిల్లలు,గర్భవతులు,బాలింతలు కోసం రాష్ట్ర ప్రభుత్వం అందించే పౌష్టికాహారం తీసుకోవడం కోసం ఒక కిలో మీటర్ దూరంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గల అంగన్వాడీ కేంద్రములోనికి రావడానికి తీవ్ర ఇబ్బందిగా ఉంటుందని అంత చిన్న వయసు కలిగిన అంగన్ వాడీ పిల్లలకు,గర్భవతులకు , బాలింతలకు పౌష్టికాహారం తీసుకోవడం ఇబ్బంది అవుతుందని సెంటర్ ఉన్న చోటనే ఉంచాలని విద్యార్థుల తల్లిదండ్రులు ,ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్,మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ సం అధికారుల దృష్టికి తీసుకెళ్లి కిషన్ దాస్ పేట,కిష్టం పల్లి ప్రజల సౌకర్యార్థం ఇక్కడి అంగన్వాడీ సెంటర్ ను మార్చవద్దని,అదే విధంగా ఇక్కడ అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తున్న సునీత ఎన్నికల బూత్ లెవల్ అధికారిగా పనిచేస్తున్నారని,ఇక్కడి అంగన్వాడీ సెంటర్ ఎత్తి వేస్తే కొత్త ఓటర్ల నమోదు కష్టం అవుతుందనీ ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఇక్కడి అంగన్ వాడీ సెంటర్ ఎత్తి వేయకూడదని ఉపసర్పంచ్ దంపతులు ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ రాష్ట్ర ప్రభుత్వం ను కోరారు.

మెగాస్టార్ చిరంజీవికి తెగ నచ్చేసిన నాని ఫ్లాప్ సినిమా… అంతలా ఏం నచ్చిందబ్బా?