ఐదేళ్లకే తల్లిదండ్రులను కోల్పోయిన అనీ మాస్టర్ కన్నీటి జీవితం

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది కొరియోగ్రాఫర్లు హీరోలకి తమదైన స్టెప్పులు నేర్పుతూ సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు.

చిరంజీవికి ముందు ఇండస్ట్రీలో డ్యాన్స్ అంటే పెద్దగా ఉండేది కాదు కానీ ఒకసారి చిరంజీవి వచ్చిన తర్వాత బ్రేక్ డాన్స్ లో తనదైన సత్తా చూపించి తెలుగు ప్రేక్షకులకు కొత్త డాన్స్ ని పరిచయం చేశాడు.

అలాగే ప్రస్తుతం ఉన్న జనరేషన్లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి హీరోలు తమదైన స్టెప్పులతో తన ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను అలరిస్తున్నారు.

వీళ్లతో పాటు కుర్ర హీరోలు అయిన రామ్, అఖిల్ లాంటి వారు కూడా తమదైన డ్యాన్స్ తో జనాలని అలరిస్తున్నారు.

అయితే తెర పైన వీళ్లు ఎన్ని స్టెప్పులు వేసినప్పటికీ తెర బయట వీళ్ళకి డాన్స్ నేర్పించే కొరియోగ్రాఫర్ లు మాత్రం చాలా కష్టపడుతుంటారు.

ఒకప్పుడు సుందరం మాస్టర్, ప్రభుదేవా, లారెన్స్ లాంటి కొరియోగ్రాఫర్లు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేస్తూ చాలా కాలం పాటు కొనసాగారు ప్రస్తుత జనరేషన్ లో శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, రఘు మాస్టర్ లాంటివారు తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు.

అయితే వీళ్లతో పాటు అమ్మాయి అయిన అనీ మాస్టర్ కూడా ఇండస్ట్రీలో చాలా మందిని కొరియోగ్రఫీ చేసి వాళ్లతో తన స్టెప్పులు వేయించింది.

అనీ మాస్టర్ పూర్తి పేరు లామా అనిత.ఈవిడ డార్జిలింగ్ లో జన్మించింది ఈవిడకి ఐదు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే వాళ్ళ నాన్న మరణించడంతో వాళ్ల అమ్మతో పాటు హైదరాబాద్ కి వచ్చేసింది.

పదో తరగతి వరకు చదివిన అని మాస్టర్ తర్వాత పెద్దగా చదువుకోలేదు కుటుంబాన్ని పోషించడానికి స్టేజ్ షోలు ఇస్తూ, వీలైనప్పుడల్లా డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేది, అలాగే అప్పుడప్పుడు సినిమా ఆడియో ఫంక్షన్ లో డాన్స్ చేసే డాన్సర్ల కి కొరియోగ్రఫీ చేస్తూ ఉండేది.

"""/"/ ఇలా నడుస్తున్న క్రమంలో ఒకరోజు చిరంజీవి శంకర్ దాదా ఎం బి బి ఎస్ సినిమా కి తనని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేయమని ఒక ఫోన్ వచ్చింది తనకి చిరంజీవి సినిమా నుంచి ఫోన్ రావడం ఏంటి ఎవరో ఊరికే చేస్తున్నారు అనుకొని తను లైట్ తీసుకుంది.

దాంతో వాళ్లు మళ్లీ ఫోన్ చేసి రమ్మనడం తో చిరంజీవి గారి ఇంటికి వెళ్లి కలిసింది.

ఆ సినిమాలో నా పేరే కాంచనమాల అనే సాంగ్ కి హరీష్ పాయ్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేసింది.

ఆ తర్వాత చాలా సినిమాలకు చాలా మంది దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసింది తన టాలెంట్ ను గుర్తించిన పూరి జగన్నాథ్ ఛార్మి తో తీసిన జ్యోతిలక్ష్మి సినిమా లో కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చాడు.

ఆ సినిమాలో తను నేర్పించిన డాన్స్ కి మంచి గుర్తింపు వచ్చింది కానీ తర్వాత అవకాశాలు పెద్దగా రాలేదు.

దాంతో ఏం చేయాలో తనకి అర్థం కాలేదు.అయితే గుడుంబా శంకర్ లాంటి సినిమాకి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేయడంతో పవన్ కళ్యాణ్ తో మంచి సాన్నిహిత్యం ఉంది.

"""/"/ దాంతో సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ జరుగుతున్న ప్లేస్ కి వెళ్లి పవన్ కళ్యాణ్ గారికి తన జ్యోతిలక్ష్మి లో చేసిన సాంగు చూపించింది.

పవన్ కళ్యాణ్ కి ఆ సాంగ్ నచ్చడంతో సర్దార్ గబ్బర్ సింగ్ లోనే ఒక సాంగ్ కొరియోగ్రాఫర్ చేసే అవకాశం ఇచ్చారు.

ఆ సాంగ్ కి కూడా తనకు మంచి గుర్తింపు రావడంతో తను వెనుదిరిగి చూడకుండా అవకాశాలు వచ్చాయి వరుసగా ఆమె లోఫర్, రోగ్, పైసా వసూల్, మహానటి, కళ్యాణ వైభోగం లాంటి సినిమాలకి కొరియోగ్రాఫర్ గా చేసి మంచి గుర్తింపును సాధించుకున్నారు.

ఇప్పటివరకు ఆమె కెరీర్లో ముప్పై సినిమాల దాకా కొరియోగ్రాఫర్ గా చేశారు.ఆమె ప్రభు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ప్రస్తుతం వీళ్ళకి ఒక బాబు కూడా ఉన్నాడు.

ప్రస్తుతం ఈవిడ సినిమాల్లో కొరియోగ్రఫీ చేస్తూనే డీ షో లో జడ్జిగా వ్యవహరిస్తూ జనాలందరికీ పరిచయమయ్యారు.

పదో తరగతి, ఇంటర్ పరీక్షలలో సేమ్ మార్క్స్ సాధించిన ట్విన్ బ్రదర్స్.. గ్రేట్ అంటూ?